Movie News

ఇంటర్నెట్‌లో మంట రేపిన దీపిక పాట

హీరోయిన్లంతా చాలెంజింగ్ రోల్స్ వెంట పడుతున్నారు. గతంలో కనిపించనంత కొత్తగా కనిపించాలనే ఆరాటంతో రకరకాల పాత్రలు ట్రై చేస్తున్నారు. ఈ విషయంలో కొందరు బాగానే సక్సెస్ అవుతున్నారు. కానీ కొందరు మాత్రం ప్రయత్నాలు బెడిసికొట్టి ఫుల్లుగా బద్నామ్ అవుతున్నారు. దీపికా పదుకొనె విషయంలో ఇప్పుడీ రెండోదే జరుగుతోంది అంటున్నారు అనలిస్టులు.       

కెరీర్ ప్రారంభం నుంచి కూడా వైవిధ్యభరితమైన పాత్రలు ఎంచుకుంటూ ఎదిగింది దీపిక. వాటిలో పద్మావత్, బాజీరావ్ మస్తానీ లాంటి హిస్టారికల్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. వీటిలో తను పోషించిన పాత్రలు ఆమె గౌరవాన్ని పెంచాయి. రాణి పాత్రకే  హుందాతనాన్ని తెచ్చిందంటూ ఆమెపై కాంప్లిమెంట్స్ కురిశాయి. నాగ్‌ అశ్విన్ లాంటి విజన్ ఉన్న డైరెక్టర్‌‌, ప్రాజెక్ట్ కె లాంటి భారీ చిత్రంలో, ప్రభాస్‌ లాంటి ప్యాన్ ఇండియా స్టార్‌‌కి జోడీగా ఆమెని సెలెక్ట్ చేయడానికి కారణం కూడా ఆ ఇమేజే అని చెప్పొచ్చు.       

అలాంటి దీపిక ‘గెహ్‌రాయియా’ చిత్రంతో ఒక్కసారిగా అందరికీ షాకిచ్చింది. రీసెంట్‌గా రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌‌ చూశాక జనాల మతులు పోయాయి. పొట్టి పొట్టి డ్రెస్సులు, టూ పీస్‌ బికినీల్లో కళ్లు చెదరగొట్టిన దీపిక.. ఇంటిమేట్ సీన్స్‌లోనూ కనిపించి ఆశ్చర్యపోయేలా చేసింది. అదింకా మర్చిపోక ముందే ఇవాళ ఈ సినిమాలోని ఓ పాట విడుదలైంది. ఇది చూశాక అందరూ నోళ్లు వెళ్లబెట్టేస్తున్నారు. ఈ పాట నిండా లిప్‌లాకులు, హాట్ సీన్లే ఉండటంతో దీపికను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.       

ఈ చిత్రంలో దీపిక పెళ్లైన మహిళ పాత్రలో నటించింది. ఆమెకి వైవాహిక జీవితంలో హ్యాపీగా ఉండదు. అంతలో తన కజిన్ అయిన అనన్యాపాండే లవర్‌‌ సిద్ధాంత్ చతుర్వేదితో పరిచయమవుతుంది. అతడితో ప్రేమలో పడిపోయి అన్ని హద్దులూ దాటేస్తుంది. వాళ్ల రిలేషన్‌ని చూపించే సన్నివేశాలే ఇవన్నీ. నిజానికి ‘హసీన్‌ దిల్‌రుబా’లో తాప్సీ చేసింది కూడా ఇలాంటి పాత్రే. భర్తతో అడ్జస్ట్ అవ్వలేక మరిదితో సంబంధం పెట్టుకుంటుందామె.        

కానీ తాప్సీ విషయంలో జనాలు ఇంతగా రియాక్టవ్వలేదు. ఎందుకంటే ఆమె సినిమా మొత్తం చీరలోను, చుడీదార్లలోనే కనిపిస్తుంది. కొన్ని హాట్ సీన్స్ ఉన్నప్పటికీ అవి ఒకట్రెండు సందర్భాలకే పరిమితమయ్యాయి. మిగతా సినిమా అంతా ఎమోషనల్‌గా ఉంటుంది. కానీ దీపిక డ్రెస్సింగ్‌ దగ్గర్నుంచి సీన్స్ వరకు లిమిట్ దాటేసినట్టు అనిపించడంతో పాటు ఆమె రణ్‌వీర్‌‌కి భార్య కూడా కావడంతో నెటిజన్స్ దారుణంగా విమర్శిస్తున్నారు. ఎందుకిలాంటివి చేస్తున్నావ్, నీ స్థాయికి అవసరమా అంటూ సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ఫిబ్రవరి 11న సినిమా చూశాక రియాక్షన్స్ ఇంకెలా ఉంటాయో.        

This post was last modified on January 25, 2022 10:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

14 minutes ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

3 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

6 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago