శ్రీ రెడ్డి.. ఈమె గురించి ఈ మధ్య జనం పట్టించుకోవడం మానేశారు కానీ.. మూడేళ్ల ముందు వరకు ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దగ్గుబాటి అభిరామ్ మీద కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో మొదలుపెట్టి.. ఎంతోమంది పేర్లను ఈ రచ్చలోకి లాగింది శ్రీరెడ్డి. మరీ దారుణంగా శేఖర్ కమ్ముల లాంటి వాళ్ల పేర్లను కూడా ఇందులోకి తీసుకురావడంతో ఆమె మాటలను జనాలు పట్టించుకోవడం పూర్తిగా మానేశారు.
అలాగే ఈ వ్యవహారంతో ఏ సంబంధం లేని పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ, అతడి తల్లిని కించపరిచేలా ఒక దారుణమైన బూతు మాటను కూడా వాడింది శ్రీరెడ్డి. అంతటితో ఆమె కథ ముగిసిపోయింది. ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న శ్రీరెడ్డి హైదరాబాద్ వదిలేసి వెళ్లి చెన్నైలో సెటిలైపోయింది. అక్కడి నుంచే తన మార్కు కామెంట్లు చేస్తున్నా జనాలు అస్సలు పట్టించుకోవడం లేదు.
కాగా ఇప్పుడు శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేయడం, క్షమాపణ చెప్పడం గమనార్హం. కాకపోతే పవన్ పేరు మాత్రం ఆమె ఎత్తలేదు. తాను కించపరిచింది చిరంజీవి తల్లి అంజనమ్మ గారిని అంటూ ఆమెకు క్షమాపణలు చెప్పింది శ్రీరెడ్డి.
ఈ మేరకు ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. “ఇండస్ట్రీలో చిరంజీవి గారు పెద్ద హీరో. వాళ్లమ్మ గారిని నేను ఆ రోజు ఆ మాట అనాల్సింది కాదు. నా బుద్ధి గడ్డి తిని ఆ మాట అన్నాను. కానీ నిజానికి ఒక ప్రయోజనం కోసం అలా మాట్లాడాలని కొందరు నన్ను మభ్యపెట్టారు. కాబట్టి ఆ మాట అన్నందుకు అమ్మవారి సాక్షిగా అంజనమ్మ గారికి క్షమాపణలు చెబుతున్నాను. నా జీవితంలో నేను ఏదైనా తప్పు చేస్తే ఎవరికైనా క్షమాపణలు చెప్పడానికి నేను వెనుకాడను. ఆ పాపం మోయడం నాకిష్టం ఉండదు. అందుకే ఇప్పుడిలా క్షమాపణ చెబుతున్నా” అని ముగించింది శ్రీరెడ్డి.
This post was last modified on January 22, 2022 10:12 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…