Movie News

ప్రభాస్.. ఖాళీ ఉందా?

ప్రభాస్ కొత్త సినిమా ఒకదాని గురించి ఇప్పుడు ఉన్నట్లుండి టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అది ప్రభాస్ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసిన ‘రాధేశ్యామ్’ గురించి కాదు. షూట్ అవగొట్టేసిన ‘ఆదిపురుష్’ గురించీ కాదు. సగం పూర్తి చేసిన ప్రశాంత్ నీల్ మూవీ ‘సలార్’ గురించి కూడా కాదు.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఇటీవలే మొదలైన ‘ప్రాజెక్ట్ కే’.. వచ్చే ఏడాది చేయాల్సిన ‘స్పిరిట్’.. ఈ రెండింటి గురించి కూడా కాదు. ఇన్ని సినిమాలను లైన్లో పెట్టిన అతను.. కొత్తగా ఇంకో సినిమాను తెరపైకి తీసుకొస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

యువ దర్శకుడు మారుతితో ‘రాజా డీలక్స్’ అనే సినిమా చేయబోతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. టైటిల్ కూడా బయటికి రావడంతో ఇది జస్ట్ రూమర్ కాదేమో అనిపిస్తోంది. అదే సమయంలో ఇప్పుడీ సినిమా చేయడానికి ఖాళీ ఎక్కడుంది.. అలాగే మారుతితో అతడికి సెట్ అవుతుందా అన్న డౌట్లు కొడుతున్నాయి.

చేతిలో ఉన్న సినిమాలకే డేట్లు సర్దుబాటు చేయలేక కిందా మీదా అయిపోతున్నాడు ప్రభాస్. ఒక సినిమా ప్రభావం ఇంకోదానిపై పడుతోంది. అన్నింటికంటే ముందు ప్రకటించిన ‘ప్రాజెక్ట్-కె’ కోసం ప్రభాస్ పెద్దగా పని చేసింది లేదు. ‘రాధేశ్యామ్’ అనుకున్నదానికంటే ఆలస్యమైంది. ఈపాటికి పూర్తి కావాల్సిన ‘సలార్’ కూడా వెనుకబడిపోయింది.

ఇంకోవైపు వచ్చే ఏడాది మధ్యకల్లా సందీప్ రెడ్డి వంగ ఖాళీ అయిపోయి ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తీయడం కోసం ఎదురు చూస్తుంటాడు. మరి చేతిలో ఉన్న ప్రాజెక్టులే ఆలస్యమవుతుంటే.. ఎంత వేగంగా చేసినా సరే రెండు మూడు నెలలు టైం కేటాయించాల్సిన మారుతి సినిమాను ప్రభాస్ ఓకే చేస్తాడా అన్నది డౌట్.

ఇక శిఖర స్థాయికి చేరిన ప్రభాస్ ఇమేజ్‌ను మ్యాచ్ చేసే సినిమాను మారుతి చేయగలడా అన్న డౌట్ కూడా ఉంది. చివరగా అతడి నుంచి ‘మంచి రోజులు వచ్చాయి’ లాంటి పేలవమైన సినిమా వచ్చింది. అంతకు ముందు అతను తీసిన ‘ప్రతి రోజు పండగే’ కూడా ఓ మోస్తరు సినిమానే.

అతడి సినిమాలు చాలా సింపుల్‌ గా, లైటర్ వీన్‌లో ఉంటాయి. ‘బాహుబలి’కి ముందు అయితే ప్రభాస్ ఆ టైపు సినిమాలు చేసినా ఓకే. కానీ ఇప్పుడు అతడి నుంచి అభిమానులు ఆశించే సినిమాల రేంజే వేరు. ఏ కథ చేసినా భారీతనం, ఏవో కొన్ని అద్భుతాలు ఆశిస్తున్నారు. మరి ప్రభాస్ లాంటి టవరింగ్ పర్సనాలిటీని పెట్టుకుని మారుతి మామూలు ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీస్తే వర్కవుట్ అవుతుందా.. అందులో ప్రభాస్ ఇమడగలడా అనేదే ప్రశ్నార్థకం.

This post was last modified on January 22, 2022 6:11 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

43 minutes ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

1 hour ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

2 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

2 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

3 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

3 hours ago