సీనియర్ హీరో నాగార్జున ఇటీవల ‘బంగార్రాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది. సంక్రాంతికి సరైన సినిమాలు లేకపోవడం ‘బంగార్రాజు’కి కలిసొచ్చింది. ఈ వారంలో కూడా పేరున్న సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. కాబట్టి నాగార్జున సినిమాకి మరిన్ని కలెక్షన్స్ రావడం ఖాయం.
ఇదిలా ఉండగా.. ‘బంగార్రాజు’ సినిమాను డైరెక్ట్ చేసిన కళ్యాణ్ కృష్ణను చెడామడా తిట్టేశారట నాగార్జున. ఈ విషయాన్ని కళ్యాణ్ కృష్ణ స్వయంగా ఒప్పుకున్నారు. ఇటీవల ‘అలీతో సరదాగా’ షోలో పాల్గొన్నారు కళ్యాణ్ కృష్ణ. ఈ సందర్భంగా అలీ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో నాగార్జున తనను తిట్టిన విషయాన్ని వెల్లడించారు. గతంలో ఈ డైరెక్టర్ నాగచైతన్య-రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అనే సినిమాను తెరకెక్కించారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఒకరిద్దరి తప్పులను కవర్ చేసినందుకు నాగార్జున తనను పిలిచి.. ‘వారి తప్పులను ఎన్నాళ్లని కవర్ చేస్తావ్.. దానివలన సినిమా రిలీజ్ లేట్ అవుతుంది కదా..’ అంటూ తిట్టేశారట.
నిజానికి ఆ విషయంలో తన తప్పు లేకపోయినా.. వేరే వాళ్లను కాపాడే క్రమంలో తిట్లు తిన్నానని చెప్పుకొచ్చారు కళ్యాణ్ కృష్ణ. ఇక ‘బంగార్రాజు’ సినిమా కథ నాగార్జునకి ఎప్పుడో చెప్పానని.. అది నచ్చి నాగార్జున సినిమా ఎప్పుడు చేసినా.. సంక్రాంతి టార్గెట్ గానే రిలీజ్ చేయాలని ముందే ఫిక్స్ అయ్యారట. అందుకే పరిస్థితులు అనుకూలించకపోయినా.. సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేశామని చెప్పారు.
This post was last modified on January 19, 2022 9:26 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…