టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కొంతకాలంగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. మొదట్లో అతడు స్నేహితుడు మాత్రమేనని.. ఇద్దరి ఇష్టాలు కలవడంతో అతడితో ఎక్కువ సమయం కలిసి గడుపుతుంటానని చెప్పింది. కానీ ఈ మధ్యకాలంలో తన రిలేషన్ గురించి ఓపెన్ గానే మాట్లాడుతుంది ఈ బ్యూటీ.
వీరిద్దరూ ముంబైలో ఒకే అపార్ట్మెంట్ లో కలిసి జీవిస్తున్నారు.
శృతిహాసన్ అప్పుడప్పుడు షేర్ చేసే ఫొటోల్లో, వీడియోల్లో శాంతను కనిపిస్తుంటారు. అయితే అసలు వీరిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారనే విషయాన్ని తాజాగా శృతి చెప్పుకొచ్చింది. శృతికి శాంతను 2018 నుంచి తెలుసట. అయితే అప్పటికి ఆమె మైకేల్ కోర్సలే అనే ఇటాలియన్ సింగర్ తో ప్రేమలో ఉంది. 2019లో మైకేల్, శృతిలకు బ్రేకప్ అయింది.
ఆ సమయంలో శృతి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. మళ్లీ తేరుకొని కెరీర్ పై ఫోకస్ పెట్టింది. అలా కొన్నాళ్లకు శాంతనుతో ప్రేమ మొదలైందట. 2020 ప్రారంభంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. మందిరాబేడీ టాక్ షో ‘ది లవ్ లాఫ్ లివ్’లో తొలిసారి శృతి తన లవ్ లైఫ్ గురించి మాట్లాడింది. ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో శాంతనుకి తనే ఫస్ట్ ప్రపోజ్ చేసినట్లు చెప్పింది శృతి.
ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది ‘క్రాక్’, ‘వకీల్ సాబ్’ సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం ‘సలార్’ సినిమాలో ప్రభాస్ కి జోడీగా కనిపించనుంది. అలానే బాలకృష్ణ-గోపీచంద్ మలినేని సినిమాలో శృతిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. అలానే మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో శృతి పేరు వినిపిస్తోంది.
This post was last modified on January 19, 2022 4:26 pm
నిన్న విడుదలైన ఉపేంద్ర యుఐకి విచిత్రమైన టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఇంటెలిజెంట్ మేకింగ్, అర్థం చేసుకున్నోళ్లకు అర్థం చేసుకున్నంత…
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…