సంక్రాంతికి మామూలుగా థియేటర్లు సర్దుబాటు చేయడం చాలా కష్టమవుతుంది తెలుగు రాష్ట్రాల్లో. ఈ సీజన్లో పెద్ద సినిమాలు రెండు మూడు బరిలో ఉంటాయి. వాటికి ముందు నుంచి థియేటర్ల బుకింగ్‌లో పోటీ ఉంటుంది. థియేటర్లు నీకా నాకా అని కొట్టేసుకుంటుంటారు. ఈ విషయంలో గతంలో చాలాసార్లు వివాదాలు కూడా తలెత్తాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.
థియేటర్లు బోలెడన్ని అందుబాటులో ఉన్నా ఉపయోగించుకునేవాళ్లు లేదు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సంక్రాంతి రేసులో ఉన్నంత వరకు థియేటర్ల కోసం కొట్టుకునే పరిస్థితే ఉంది. కానీ అవి రేసు నుంచి తప్పుకోవడంతో ఒక్కసారిగా డిమాండ్ పడిపోయింది. ‘బంగార్రాజు’ సినిమాకు కోరుకున్న దాని కంటే ఎక్కువ స్క్రీన్లు, షోలు లభించాయి. రౌడీ బాయ్స్, హీరో చిత్రాలకు కూడా కోరుకున్నదానికంటే మంచి రిలీజే దక్కింది.
కానీ ఈ మూడు చిత్రాల్లో దేనికీ అంత మంచి టాక్ రాలేదు. ఉన్నంతలో ‘బంగార్రాజు’ పరిస్థితి మేలు. ఐతే ఆ చిత్రం కూడా తొలి వారాంతంలో మంచి వసూళ్లు రాబట్టింది. వీకెండ్ తర్వాత ఆక్యుపెన్సీ తగ్గింది. ఇప్పుడు అవసరానికి మించి థియేటర్లలో సినిమా ఆడుతోంది. రౌడీ బాయ్స్ పరిస్థితి కాస్త పర్లేదు కానీ.. ‘హీరో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర వాషౌట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ టైంలో ఇంకేదైనా మంచి సినిమా రిలీజై ఉంటే అది పండుగ చేసుకునేది.
కానీ కరోనా థర్డ్ వేవ్ భయాలతో పేరున్న సినిమాలన్నీ వెనక్కి తగ్గాయి. ఇప్పుడు కావాల్సినన్ని థియేటర్లు దక్కే ఛాన్సులున్నా కాస్త క్రేజున్న సినిమాలేవీ విడుదలకు ముందుకు రావడం లేదు. సంక్రాంతి తర్వాతి వారం ‘ఉనికి’ అంటూ ఏదో చిన్న సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. దీని గురించి ప్రేక్షకులకు పెద్దగా పట్టింపే లేదు. కంటెంట్ ఉన్న సినిమాను దించితే పెద్ద ఎత్తున థియేటర్లు దక్కే ఛాన్సున్నా, రిజల్ట్ కూడా బాగుంటుందన్న సంకేతాలు కనిపిస్తున్నా ఉపయోగించుకోవడానికి ఎవరూ ముందుకు రావట్లేదు.
This post was last modified on January 18, 2022 8:38 am
AI వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన GPT-6 ఆస్ట్రా ఆ భయాన్ని మరో…
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో అటవీ ప్రాంత ఐదు పిల్ల ఒరాంగుటాన్లు కనిపించడం కలకలం రేపింది. బడపై గ్రామం సమీపంలోని రణకథ…
భయపడినట్టే జరిగేలా ఉంది. డిసెంబర్ 3 అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీని ఫౌజీ వదులుకునేలా ఉంది. ఇంకా షూటింగ్ జరుగుతూ…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజువారీ…
ఏపీలో స్థానిక ఎన్నికల హడావుడి మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండున్నరేళ్ళ తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అధికార,…
అదేంటి రాముడు యుద్ధం చేయాల్సింది రావణుడితో కదా, మరి గాడ్జిల్లాతో ఏంటని ఆశ్చర్యపోకండి. విషయం వేరే ఉంది. నవంబర్ 6…