రాజుగాడిగా జాతిరత్నం

నవీన్ పొలిశెట్టి.. ఈ పేరు వినగానే గుర్తొచ్చేవి రెండు. ఒకటి సూపర్బ్ ఎనర్జీ. రెండోది గ్యాప్ ఇవ్వకుండా గలగలా మాట్లాడే తీరు. ఈ రెండింటికీ తన సెన్సాఫ్ హ్యూమర్‌‌ని మిక్స్‌ చేసి సక్సెస్ అయ్యాడు నవీన్. తన కొత్త మూవీ కూడా ఇదే స్టైల్లో ఉంటుందని చెబుతున్నాడు.

జాతిరత్నాలు సక్సెస్ తర్వాత వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు నవీన్. వాటిలో ఒకటి యూవీ క్రియేషన్స్‌లో సినిమా. ఇందులో అనుష్క హీరోయిన్‌గా నటిస్తోంది. మరొకటి.. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్‌లో సితార ఎంటర్‌‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ 4 సినిమాస్‌ నిర్మిస్తున్న చిత్రం. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ను ఓ టీజర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఈ వీడియో కూడా నవీన్‌ స్టైల్‌లో హిలేరియస్‌గా ఉంది.

పెళ్లి సెటప్‌ వేసి ఉంది. స్టేజ్‌ మీద పెళ్లికొడుకు గెటప్‌లో నిలబడి ఉన్నాడు నవీన్. రాజుగాడి పెళ్లి ఇక్కడ అంటూ తెగ హెచ్చులు పోతున్నాడు. తన గురించి గప్పాలు కొట్టుకుంటున్నాడు. తన పెళ్లి ఫొటోలు కూడా విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ కుళ్లిపోవాలి అంటున్నాడు. ఫైనల్‌గా ఇది మోస్ట్ ఎంటర్‌‌టైనింగ్‌ ఈవెంట్‌ ఆఫ్ ద డికేడ్ అంటూ సినిమా టైటిల్‌ను రివీల్ చేశాడు.

ఈ చిత్రానికి అనగనగా ఒక రాజు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అచ్చంగా నవీన్‌ స్టైల్‌లో ఫుల్ ఎంటర్‌‌టైనింగ్‌గా ఉండే మూవీ అని ఈ ఒక్క టీజర్‌‌తో క్లారిటీ వచ్చేసింది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మిగతా నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.