2020లో టాలీవుడ్ చూడబోయే ఏకైక పెద్ద సినిమా వకీల్ సాబ్
. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఈ యేడాదే వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు వస్తాడు. అందుకోసం దిల్ రాజు సర్వ సన్నాహాలూ చేసేస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలెట్టాలన్నది దిల్ రాజు ఆలోచన. వకీల్ సాబ్ హీరోయిన్ ఎవరు? అనే విషయంలోనూ ఓ స్పష్టత వచ్చేసింది.
పవన్ సరసన శ్రుతిహాసన్ దాదాపు ఖాయం. అయితే స్క్రిప్టులో రాసుకున్న సన్నివేశాల్ని బాగా కుదించే సరికి శ్రుతి పాత్ర లెంగ్త్ బాగా తగ్గిందని వినికిడి. ఓ వారం రోజులు శ్రుతి కాల్షీట్లు ఇస్తే చాలు. తన వర్క్ పూర్తవుతుంది. శ్రుతి కూడా అందుకు సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తోంది.
సాధారణంగా శ్రుతి హాసన్ పారితోషికం కోటి నుంచి కోటి పాతిక లక్షల వరకూ ఉంటుంది. అయితే ఈ సినిమా కోసం మాత్రం 60 లక్షలతో సరిపెట్టుకుంది. ఏడు రోజులకు అరవై లక్షలంటే.. మంచి మొత్తమే. పవన్‌తో సినిమా, పైగా పెద్ద బ్యానర్, తక్కువ రోజుల్లో ఎక్కువ పారితోషికం.. ఇక శ్రుతి కాదనడానికి ఏముంది?
కాకపోతే ఈ సినిమాలో ఉన్నానన్న విషయం శ్రుతి ఇప్పటి వరకూ బయట పెట్టలేదు. వకీల్ సాబ్
లో మీరు నటిస్తున్నారా? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు శ్రుతి సమాధానం చెబుతూ `”ఆవిషయం నేను చెప్పకూడదు” అంటూ దాటేసింది. అంటే… దిల్ రాజు నోటి నుంచి వచ్చేంత వరకూ ఈ విషయాన్ని ఆమె సస్పెన్స్‌గా ఉంచాలనుకుంటోందన్నమాట.
This post was last modified on June 11, 2020 8:25 pm
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…
‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో సందీప్ రెడ్డి వంగ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా…
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో…
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ తాజాగా నోటీసులు జారీ చేసింది. కోటీ 15 లక్షల…
ఇవాళ అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న గేమ్ ఛేంజర్ మీద తెలంగాణ అసెంబ్లీ పెద్ద బాంబు వేసింది. సంధ్య…