మొత్తానికి సంక్రాంతి సీజన్ రానే వచ్చింది. అంచనాలకు భిన్నంగా ఈసారి భారీ చిత్రాలు రేసు నుంచి తప్పుకుని.. ఒక మీడియం రేంజ్ మూవీ, దాంతోపాటు రెండు చిన్న సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి. ప్రేక్షకుల దృష్టిని ప్రధానంగా ఆకర్షిస్తున్నది ఆ మీడియం రేంజ్ మూవీనే అనే విషయంలో మరో మాట లేదు.
2016 సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన సోగ్గాడే చిన్నినాయనాకు సీక్వెల్‌గా తెరకెక్కిన బంగార్రాజునే ఆ మూవీ. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ రేసు నుంచి తప్పుకోవడంతో దీనిపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సోగ్గాడే చిన్నినాయనాకు సీక్వెల్ కావడం, సంక్రాంతికి పర్ఫెక్ట్ అనిపించే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లా కనిపిస్తుండటం దీనికి బాగా కలిసొచ్చే అంశాలు.
నాగార్జున, నాగచైతన్యల కలయిక కూడా దీనికి ప్లస్సే. మొత్తంగా సంక్రాంతి సీజన్లో ఈ చిత్రం వసూళ్ల మోత మోగించేలా కనిపిస్తోంది. ఐతే సంక్రాంతి సీజన్లోనే వస్తున్న చిన్న సినిమాలు రౌడీ బాయ్స్, హీరో.. బంగార్రాజు పోటీని ఏమేర తట్టుకుని నిలబడతాయన్నదే సందేహంగా మారింది. ఈ రెండు చిత్రాల హీరోలు కొత్త వాళ్లు. రెండు వారాల ముందు వరకు వీటి రిలీజ్ గురించి చప్పుడే లేదు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు వాయిదా పడటంతో ఇవి రేసులోకి వచ్చాయి.
ప్రమోషన్ల పరంగా ఎంత హడావుడి చేసినప్పటికీ అనుకున్నంత బజ్ రాలేదు. తెలుగు ప్రేక్షకులు సంక్రాంతి సీజన్లో భారీ చిత్రాలుంటే ఒకటికి మించి సినిమాలు చూస్తారు కానీ.. ఇలాంటి చిన్న సినిమాలు, పైగా కొత్త హీరోలు నటించినవాటిని ఏమేర పట్టించుకుంటారన్నది సందేహమే. బంగార్రాజుకు ఓ మోస్తరు టాక్ వచ్చినా నడిచిపోతుంది కానీ.. వీటికి మాత్రం చాలా మంచి టాక్ వస్తేనే నిలబడతాయి. మరి రౌడీ బాయ్స్, హీరో అలాంటి టాకే తెచ్చుకుని బాక్సాఫీస్ సక్సెస్ సాధిస్తాయేమో చూడాలి.
This post was last modified on January 14, 2022 4:38 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…