నాగచైతన్య కెరీర్ గురించి మాట్లాడాల్సి వస్తే ‘మజిలీ’కి ముందు ‘మజిలీ’ తర్వాత అని డివైడ్ చేసి చూడాలి. ఎందుకంటే ఆ సినిమా వచ్చేవరకు చైతులోని నటుడు ఎలాంటివాడో పూర్తిగా తెలియలేదు. భగ్నప్రేమికుడిగా, ఇష్టం లేని అమ్మాయితో కాపురం చేయలేక నలిగిపోయే భర్తగా సెంటిమెంటు పండించి మెప్పించాడు. ఇక ఆ తర్వాత చైతు వెనక్కి తిరిగి చూసుకోలేదు. దానికి కారణం కచ్చితంగా అతని ప్లానింగే.
చైతు సినిమాటోగ్రఫీ చూస్తే 100 పర్సెంట్ లవ్, ఏం మాయ చేశావె, మనం లాంటి ఏవో కొన్ని మంచి సినిమాలు మాత్రమే కనిపిస్తాయి. మిగతావన్నీ ఫ్లాపులే. వాటిలో ఆటోనగర్ సూర్య, దడ లాంటి డిజాస్టర్స్ కూడా ఎక్కువే. వీక్ స్టోరీస్‌ని సెలెక్ట్ చేసుకుని వరుస పరాయజయాలతో నలిగిపోయాడు చైతు. ఆ పీరియడ్ రిపీట్ కాకుండా ఉండటానికి ఇప్పుడు పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో అడుగులు వేస్తున్నాడు.
‘లవ్‌స్టోరీ’ సక్సెస్ తర్వాత మరింత జాగ్రత్త పడుతున్న చైతు.. విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో ‘థాంక్యూ’ మూవీ చేస్తున్నాడు. ఇదే డైరెక్టర్‌తో త్వరలో ఓ వెబ్ సిరీస్ కూడా చేయబోతున్నాడు. ఇది హారర్ కాన్సెప్ట్. బేసిగ్గా దెయ్యాల సినిమాలంటే చచ్చేంత భయం చైతూకి. కానీ కొత్తగా ఏదైనా చేయాలనే తపనతోనే ఈ సిరీస్‌కి ఓకే అన్నానని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే ఆమిర్ ఖాన్ ‘లాల్‌సింగ్ చద్ధా’లో కీలక పాత్రలో నటించాడు. దేశం కోసం ప్రాణాలిచ్చే సైనికుడిగా హార్ట్ టచింగ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు.
ఇవి కాక పరశురామ్ డైరెక్షన్‌లోనూ ఓ మూవీకి సైలెంట్‌గా కమిటయ్యాడు. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తను చెప్పేవరకు ఎవరికీ తెలీదు. ప్రస్తుతం మహేష్ బాబుతో ‘సర్కారువారి పాట’ తీసే పనిలో ఉన్నాడు పరశురామ్. అది పూర్తయ్యాక చైతు సినిమా స్టార్టవుతుందట. ఇక రేపు ‘బంగార్రాజు’గానూ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. తన లైనప్ చూస్తుంటేనే వెరైటీ వైపు అడుగులు వేస్తున్నాడని అర్థమైపోతోంది. జానర్స్ మారుస్తున్నాడు. ఆ జానర్స్లో ఎక్స్పర్ట్స్ అయిన దర్శకులతో పని చేయడానికి సిద్ధమవుతున్నాడు. తన ప్లానింగ్ కనుక ఇలాగే కొనసాగితే ఇక చైతూకి తిరుగు లేనట్టే.
This post was last modified on January 13, 2022 6:51 pm
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…