Movie News

గాయాలు గుర్తు చేస్తున్న సిమ్రాన్


సిమ్రాన్.. 90వ దశకం చివరి నుంచి ఒక పదేళ్ల పాటు దక్షిణాది సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపిన హీరోయిన్. అప్పట్లో ఇండియాలో ఆమె టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు ఎదురే లేదసలు. పర్ఫెక్ట్ ఫిగర్‌కు బాగా నటించగల నైపుణ్యం కూడా ఉన్న ఆమెకు సాటి వచ్చే హీరోయిన్లు కనిపించే వారు కాదు. ఇప్పటి టాప్ హీరోయిన్లను సిమ్రాన్‌తో పోల్చి చూసినా.. ఆమె ముందు వాళ్లు తూగలేరంటే అతిశయోక్తి కాదు.

ఇటు తెలుగులో, అటు తమిళంలో టాప్ స్టార్లలో భారీ చిత్రాల్లో నటించింది సిమ్రాన్. కెరీర్ చరమాంకంలో పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైన సిమ్రాన్.. కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత తమిళంలో లీడ్, క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది. ‘పేట’ సహా కొన్ని పెద్ద సినిమాల్లో ఆమె నటించిన సంగతి తెలిసిందే. తమిళంలో ఇప్పటికీ బిజీగా ఉన్న సిమ్రాన్.. తెలుగులో మాత్రం మళ్లీ కనిపించట్లేదు.

ఐతే మళ్లీ తనను తెలుగు సినిమాలకు కన్సిడర్ చేయాలని హింట్స్ ఇస్తోందో ఏమో తెలియదు కానీ.. కొన్ని రోజులుగా తాను నటించిన సినిమాల వార్షికోత్సవాల్ని పురస్కరించుకుని చాలా ఉత్సాహంగా, ఎమోషనల్‌గా ట్వీట్లు వేస్తోంది సిమ్రాన్. ఐతే సూపర్ హిట్లు, బ్లాక్‌బస్టర్ల వార్షికోత్సవాలపుడు వాటిని గుర్తు చేసుకుంటూ ట్వీట్లు వేస్తే బాగానే ఉంటుంది కానీ.. మరిచిపోదగ్గ చిత్రాలకు ఇలా ఎమోషనల్ అవుతూ ట్వీట్లు వేస్తేనే జనాలకు రుచించదు. ఉదాహరణకు మొన్న ‘ఒక్కమగాడు’ సినిమాను గుర్తు చేసుకుంది సిమ్రాన్. నందమూరి అభిమానులకు అదెంతటి చేదు జ్ఞాపకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమాను కొనియాడుతూ ట్వీట్ వేయడం బాలయ్య అభిమానులకు ఇబ్బందిగా మారింది. అలాగే మరో సంక్రాంతి బాలయ్య సినిమా ‘సీమ సింహం’ గురించి కూడా ఇలాగే ట్వీట్ వేసింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే.

సిమ్రాన్ చిరంజీవి అభిమానులను సైతం విడిచిపెట్టలేదు. తాజాగా ‘మృగరాజు’ వార్షికోత్సవం నేపథ్యంలో ఆ సినిమాను గుర్తు చేసింది. చిరు అభిమానులకైతే ఈ చిత్రం మామూలు షాక్ కాదు. సంక్రాంతి టైంలో ‘నరసింహనాయుడు’కు పోటీగా వచ్చి దాని ముందు చతికిలపడటంతో అప్పట్లో చిరు అభిమానులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మరి ఇలాంటి గాయాలను సిమ్రాన్ ఇప్పుడు గుర్తు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో?

This post was last modified on January 12, 2022 5:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు ఐడియా: డ్వాక్రా పురుష గ్రూపులు!

రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అన‌గానే మ‌హిళ‌లే గుర్తుకు వ‌స్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా సంఘాలు!…

2 hours ago

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

9 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

9 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

10 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

10 hours ago