టాలీవుడ్లో సెల్ఫ్ ప్రమోషన్ విషయంలో అల్లు అర్జున్ తర్వాతే ఎవరైనా. బలమైన పీఆర్ టీంను పెట్టుకుని ఆన్ లైన్, ఆఫ్ లైన్ ఇమేజ్ బిల్డప్ గట్టిగా చేసుకుంటూ ఉంటాడు బన్నీ. ఒక ప్రణాళిక ప్రకారం, సమయోచితంగా తన సొంత బ్రాండ్‌ను పెంచుకోవడంలో బన్నీ ప్లానింగ్ అందరికీ బాగానే అర్థమవుతోంది. ఇన్నాళ్లూ స్టైలిష్ స్టార్‌గా ఉన్న అతను ఈ మధ్య ఉన్నట్లుండి ఐకాన్ స్టార్ అయిపోయాడు.
ఈ బిరుదు బన్నీకి ఎవరిచ్చారన్న విషయంలో సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతుంటాయి. కానీ బన్నీ, అతడి టీం అదేమీ పట్టించుకోకుండా ఆ ట్యాగ్‌ను పాపులర్ చేయడంలో విజయవంతం అయింది. ఇప్పుడు బన్నీ సెల్ఫ్ ప్రమోషన్ విషయంలో ఇంకో అడుగు ముందుకు వేశాడు. దిల్ రాజు సోదరుడి కొడుకు అశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న రౌడీ బాయ్స్ మూవీకి సంబంధించి ఒక ప్రమోషనల్ ఈవెంట్‌కు అతిథిగా వచ్చిన బన్నీ.. తాను వేసుకున్న టీషర్ట్‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు.
టీ షర్ట్ వెనుక ఇది సార్ నా బ్రాండ్ అనే పదాలకు తోడు ఎరుపు రంగుతో ఉన్న చేతి ముద్ర కనిపించింది. పుష్ప మూవీ క్లైమాక్స్‌లో బన్నీ.. విలన్ ఫాహద్ ఫాజిల్‌తో చెప్పే డైలాగ్ ఇది. ఆ డైలాగ్‌నే టీషర్ట్ మీద ట్యాగ్‌గా మార్చి రౌడీ బాయ్స్ ఈవెంట్లో హల్‌చల్ చేశాడు బన్నీ. వేదిక మీద ప్రసంగిస్తూ అభిమానుల గురించి ప్రస్తావించినపుడు వారి వైపు తిరిగి ఆ ట్యాగ్ చూపించాడు కూడా.
ఐతే ఈ విషయంలో సోషల్ మీడియా జనాల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. ఒకప్పుడు మెగా గొడుగు కింద ఉంటూ వచ్చిన బన్నీ.. ఈ మధ్య మెగా అనే మాటే ఎత్తట్లేదు. ఏఏ ఆర్మీ అంటూ తన అభిమానులు వేరు అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. తనది మెగా బ్రాండు కాదని.. అల్లు బ్రాండ్ అని చెప్పకనే చెబుతున్నాడు. సినిమాలో ఆ డైలాగ్ పెట్టించడం, ఇప్పుడు ఆ ట్యాగ్‌తో ఉన్న టీ షర్ట్ ధరించి హల్ చల్ చేయడం ద్వారా బన్నీ ఇస్తున్న సంకేతాలు మెగా అభిమానుల్లో ఓ వర్గానికి అస్సలు రుచించడం లేదు.
This post was last modified on January 11, 2022 9:05 am
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…