కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ కి బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే ఈ హీరో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ముందుగా శేఖర్ కమ్ముల సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ధనుష్.. ఇటీవల మరో సినిమా అంగీకరించారు. అదే ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
శేఖర్ కమ్ముల సినిమా ఆలస్యమవుతుండడంతో ముందుగా ‘సార్’ని సెట్స్ పైకి తీసుకెళ్లారు. రీసెంట్ గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. రెండురోజుల పాటు సినిమా షూటింగ్ లో పాల్గొన్న ఈ బ్యూటీ ఇప్పుడు సడెన్ గా తప్పుకున్నట్లు సమాచారం. ధనుష్ లాంటి స్టార్ హీరో.. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ బ్యాకప్ ఉన్నప్పటికీ.. సంయుక్త ఈ సినిమా నుంచి తప్పుకోవడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. అయితే ఈ విషయం ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.
కానీ సంయుక్త మాత్రం ఈ సినిమా నుంచి తప్పుకుందని చెబుతున్నారు. ఈ విషయంపై చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. మలయాళంలో పదికి పైగా సినిమాల్లో నటించిన సంయుక్త మీనన్ ‘భీమ్లా నాయక్’ సినిమాలో నటిస్తోంది. తెలుగులో మొదటి సినిమా రిలీజ్ కాకుండానే ఆమెకి ధనుష్ సినిమాలో ఛాన్స్ రావడంతో ఇక్కడ టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడామె ‘సార్’ టీమ్ కి సడెన్ షాకిచ్చింది.
This post was last modified on January 10, 2022 11:14 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…