ఒక హిట్ సినిమా కథను పొడిగిస్తూ సీక్వెల్ తీయడం మామూలే. కానీ ఒకే కథను రెండు భాగాలుగా తీయడం గత కొన్నేళ్ల నుంచి చూస్తున్నాం. ఈ ఒరవడికి శ్రీకారం చుట్టింది కమల్ హాసన్. ఆయన తన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘విశ్వరూపం’ సినిమా రెండు భాగాలుగా విడుదలైంది. పార్ట్-1 సెన్సేషనల్ హిట్టయి.. రెండో భాగంపై అంచనాల్ని భారీగా పెంచింది. ఐతే ‘విశ్వరూపం’ రిలీజవుతున్నపుడు దీనికి సెకండ్ పార్ట్ ఉందని జనాలకు తెలియదు.
కమల్ కూడా ఆ విషయాన్ని చెప్పలేదు. సినిమాను మధ్యలో ముగించి రెండో భాగం కోసం ఎదురు చూడమన్నాడు. ‘విశ్వరూపం-1’ సూపర్ హిట్టయ్యాక ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా రెండో భాగం కోసం ఎదురు చూశారు. ఐతే రకరకాల కారణాల వల్ల ఆ సినిమా చాలా ఆలస్యమైంది. చివరికి మూడేళ్ల కిందట రిలీజైన ఆ చిత్రం ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఫస్ట్ పార్ట్‌కు ఏ రకంగానూ అది సరితూగలేదు.
ఇక ‘బాహుబలి’ విషయానికి వస్తే దీన్ని ఒక సినిమాగా తీద్దామనే మొదలుపెట్టాడు రాజమౌళి. కానీ మధ్యలో ఆయన ఆలోచన మారి రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నాడు. ఫస్ట్ పార్ట్ తర్వాత భారీగా పెరిగిన అంచనాలను అందుకుంటూ సెకండ్ పార్ట్‌ను ఇంకా పెద్ద హిట్ చేయగలిగాడు. ఈ విషయంలో ‘బాహుబలి’ ట్రెండ్ సెట్ చేసింది. ఆ తర్వాత ఇలాగే రెండు భాగాల సినిమాగా ‘కేజీఎఫ్’ వచ్చింది.
ఐతే ముందే ‘చాప్టర్-1’ అంటూ రిలీజ్ చేయడం ద్వారా సెకండ్ పార్ట్ ఉందని సంకేతాలు ఇచ్చారు. ఈ చిత్రం అసాధారణ విజయాన్నందుకుంది. సెకండ పార్ట్ మీద భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాల్ని సినిమా అందుకుంటుందనే అంచనాలే ఉన్నాయి. మధ్యలో ‘యన్.టి.ఆర్’ సినిమా సైతం బాహుబలి తరహాలోనే మధ్యలో రెండు భాగాలుగా మారింది. కానీ ఈ ఆలోచన బెడిసికొట్టింది. ఫస్ట్ పార్ట్ ఫ్లాప్ అయితే.. సెకండ్ పార్ట్ దాన్ని మించి డిజాస్టర్ అయింది. ఇప్పుడిక ‘పుష్ప’ రెండు భాగాల సినిమాగా రాబోతోంది. ఇది కూడా బాహుబలి, యన్.టి.ఆర్‌ల తరహాలోనే మధ్యలో రెండు భాగాలుగా మారిన చిత్రం.
ఇది సరైన ఆలోచనేనా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘పుష్ప-1’ రిలీజైనపుడు డివైడ్ టాక్ రావడంతో రెండు భాగాలుగా సినిమా తీయాలనుకోవడమే తప్పన్నారు. తొలి భాగమే సంతృప్తి పరచని నేపథ్యంలో అసలు సెకండ్ పార్ట్ ఉంటుందో లేదో అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ డివైడ్ టాక్‌ను తట్టుకుని ఈ సినిమా విజయవంతం అయింది. సెకండ్ పార్ట్ మీద ఇప్పుడు అంచనాలు, ఆసక్తి పెరిగాయి. మరి అంచనాల ఒత్తిడిని తట్టుకుని సుక్కు ఎలాంటి సినిమాను డెలివర్ చేస్తాడు.. ‘పుష్ప-2’ సినిమా బాహుబలిని అనుసరిస్తుందా.. విశ్వరూపం, యన్.టి.ఆర్‌ల కోవలో పయనిస్తుందా అన్నది చూడాలి.
This post was last modified on January 10, 2022 5:27 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…