ఒకప్పుడు హీరోల కొడుకులు మాత్రమే హీరోలయ్యే వాళ్లు. ఆ తర్వాత వాళ్ల మేనల్లుళ్లు.. అన్నదమ్ముల కొడుకులు కూడా ఇండస్ట్రీలోకి రావడం మొదలైంది. గత కొన్నేళ్లలో హీరోల అల్లుళ్లు కూడా హీరోలైపోతుండటం చూస్తున్నాం. ఈ జాబితాలో కృష్ణ అల్లుడు సుధీర్ బాబు పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. అతను హీరో అయిన మొదట్లో చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. కానీ తర్వాత నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుని హీరోగా నిలబడ్డాడు.
తాను కూడా అలాగే నిలదొక్కుకుంటానని అనుకుని ఉంటాడు మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్. శ్రీజను పెళ్లి చేసుకున్న కొంత కాలానికి కళ్యాణ్ తెరంగేట్రం చేశాడు. అతడి తొలి చిత్రానికి ‘విజేత’ అంటూ చిరంజీవి క్లాసిక్ మూవీ టైటిల్ కూడా పెట్టుకున్నాడు. కానీ ఈ చిత్రం కళ్యాణ్‌ను తీవ్ర నిరాశకే గురి చేసింది. తొలి సినిమా ఫ్లాప్ అయినా నిరాశ చెందకుండా ‘సూపర్ మచ్చి’ అని, ‘కిన్నెరసాని’ అని రెండు సినిమాలను లైన్లో పెట్టాడు కళ్యాణ్.
ఈ రెండు చిత్రాలూ దాదాపుగా ఒకే టైంలో విడుదలకు సిద్ధమయ్యాయి. ఐతే కళ్యాణ్ దృష్టంతా ‘కిన్నెరసాని’ మీదే ఉన్నట్లుంది. ‘అశ్వథ్థామ’ దర్శకుడు రమణ తేజ రూపొందించిన ఈ థ్రిల్లర్ మూవీ జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని ప్రోమోలు కూడా బాగున్నాయి. ఐతే కళ్యాణ్ ఎప్పుడో పూర్తి చేసిన ‘సూపర్ మచ్చి’ చడీచప్పుడు లేకుండా సంక్రాంతి రేసులోకి వచ్చింది. ఆ సినిమాకు ఏమాత్రం బజ్ లేదు.
కళ్యాణ్ దేవ్ కూడా ఆ చిత్రాన్ని పట్టించుకుంటున్నట్లు లేడు. దాని మీద అతడికి ఏమాత్రం ఆశలు లేనట్లే ఉన్నాయి. ఈ చిత్రానికి ప్రమోషన్లు లేవు. కనీసం ఒక ట్రైలర్ కూడా లాంచ్ చేయలేదు. సోషల్ మీడియాలో కూడా ఏమాత్రం సందడన్నదే లేదు. చూస్తుంటే సినిమాను నామమాత్రంగా రిలీజ్ చేసి వదిలించేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. పులి వాసు దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. సంక్రాంతికి ‘బంగార్రాజు’ సహా మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. ప్రేక్షకుల దృష్టంతా వాటి మీదే ఉంది. వీటి మధ్య ‘సూపర్ మచ్చి’ కొట్టుకుపోవడం లాంఛనమే.
This post was last modified on January 10, 2022 7:36 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…