‘పుష్ప 2’ ఐటెం సాంగ్.. సుకుమార్ ప్లాన్ ఇదే!

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప ది రైజ్’ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా ‘పుష్ప ది రూల్’ అనే సినిమా రాబోతుంది. కొన్ని రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సుకుమార్ సెకండ్ పార్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

‘పుష్ప ది రైజ్’లో సమంత ఐటెం సాంగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నిజం చెప్పాలంటే.. ఇందులో అల్లు అర్జున్ డాన్స్ కంటే జనాలంతా సమంత పెర్ఫార్మన్స్ ను బాగా ఎంజాయ్ చేశారు. ఆమె కాస్ట్యూమ్స్, క్లీవేజ్ షోతో రచ్చ చేసింది. ఆమె గ్లామర్ షోకి, మాస్ స్టెప్స్ కి బీ,సీ ఆడియన్స్ లో భారీ క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ‘పుష్ప’ సెకండ్ పార్ట్ లో కూడా అదే రేంజ్ లో ఐటెం సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట. 

దేవిశ్రీప్రసాద్-సుకుమార్ అంటే ఐటెం సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఈసారి ‘ఊ అంటావా మావా’కి మించి ఐటెం సాంగ్ ఉండాల్సిందేనని భావిస్తున్నారు. అయితే సమంత ప్లేస్ లో బాలీవుడ్ భామను తీసుకోవాలని అనుకుంటున్నారు.

ఎందుకంటే ‘పుష్ప’ సినిమాకి హిందీలో మంచి టాక్ వచ్చింది. అలానే భారీ కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఈసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను రంగంలోకి దింపితే నార్త్ లో మరింత బజ్ వస్తుందనేది ఆలోచన. ఎట్టిపరిస్థితుల్లో ఈ ప్లాన్ వర్కవుట్ చేయాలని చూస్తున్నారు. మరి పుష్పరాజ్ తో స్టెప్ వేయడానికి ఏ హీరోయిన్ ముందుకొస్తుందో చూడాలి. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలని చూస్తున్నారు.