Movie News

పుస్తకం ఆధారంగా ‘ఆచార్య’..?

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. ఇందులో రామ్ చరణ్ కీలకపాత్ర పోషించారు. దేవాదాయ భూములు అన్యాక్రాంతం కావ‌డం అనే అంశంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మెసేజ్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను మిక్స్ చేసి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ వాయిదా మీద వాయిదా పడుతూనే ఉంది. 

ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలైతేనే కానీ ‘ఆచార్య’ రాదని అంటున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ‘ఆచార్య’ సినిమా కథ శ్రీకాకుళంలో జిల్లాలో ఎప్పుడో 1970లలో జరిగిన కథ అని అంటున్నారు. ‘సుబ్బారావు పాణిగ్రాహి’ అనే పుస్తకం ఆధారంగా ‘ఆచార్య’ను తెరకెక్కించారట. 

ఒరిస్సాకు చెందిన సుబ్బారావు అనే వ్యక్తి శ్రీకాకుళంలో బొడ్డపాడు అనే గ్రామంలో  శివుడి గుడిలో పూజారిగా ఉంటూ భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. అతడి జీవితం ఆధారంగానే ‘సుబ్బారావు పాణిగ్రాహి’ అనే పుస్తకం రాశారు. సుబ్బారావు తరువాత ఆ ఉద్యమాన్ని అతడి తమ్ముడు హేమచంద్ర పాణిగ్రాహి చేపట్టాడు. అదే సమయంలో ఆ ప్రాంతానికి చెందిన ఇద్దరు పేరున్న నక్సలైట్లు సుబ్బారావు చేసే ఉద్యమానికి సపోర్ట్ గా నిలిచేవారు. 

ఈ ఇద్దరు నక్సలైట్లు ఉపాధ్యాయులుగా పని చేసి అక్కడ ప్రజలను చైతన్యవంతులను చేసేవారు. ఇప్పుడు కొరటాల శివ అదే థీమ్ ను తీసుకొని.. సినిమాకి కూడా ‘ఆచార్య’ అనే టైటిల్ పెట్టారని తెలుస్తోంది. చిన్న చిన్న మార్పులతో సుబ్బారావు జీవితాన్ని ‘ఆచార్య’ సినిమాగా తీసినట్లు సమాచారం. 

This post was last modified on January 9, 2022 9:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టీడీపీలో మ‌రో ప‌వ‌ర్ సెంట‌ర్ అత‌డే..?

టీడీపీలో ఇప్పుడు ఒక పేరు త‌ర‌చూ వినిపిస్తోంది. ఆ పేరు 2014లో పార్టీ విజ‌యం సాధించిన‌ప్పుడూ వినిపించింది.. ఇప్పుడు 2024…

1 hour ago

సంధ్య కి షోకాజ్ నోటీసులు : వివరణ ఇవ్వకపోతే లైసెన్స్ రద్దు!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి…

2 hours ago

ఎర్రచందనం పుష్పరాజ్ – గంజాయి ఘాటీ రాణి!

వచ్చే ఏడాది ఏప్రిల్ 18 విడుదల కాబోతున్న ఘాటీ అనుష్క అభిమానులకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే పెర్ఫార్మన్స్ ఆధారంగా టైటిల్…

4 hours ago

ప్యాన్ ఇండియా వద్దు….సీనియర్ స్టార్లే ముద్దు!

కామెడీ, కమర్షియల్, యాక్షన్ ఈ మూడు అంశాలను సరైన పాళ్లల్లో కలిపి బ్లాక్ బస్టర్లు కొట్టడంలో అనిల్ రావిపూడి శైలే…

4 hours ago

రేపటి నుంచి తగ్గనున్న పుష్ప 2 టికెట్ రేట్లు!!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పుష్ప 2 ది రూల్ కి ఇచ్చిన భారీ టికెట్ రేట్ల వెసులుబాట్లు ఈ రోజుతో…

5 hours ago