సంక్రాంతికి సందడి చేయాల్సిన భారీ చిత్రాలు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వాయిదా పడగానే వరుసబెట్టి చాలా చిన్న సినిమాలు పండుగ రేసులోకి వచ్చేశాయి. ఆల్రెడీ పండక్కి షెడ్యూల్ అయిన ‘బంగార్రాజు’ కాకుండా అరడజనుకు పైగానే సినిమాలు పోటీకి సై అనడం విశేషం. ఐతే ముందు వెనుక చూసుకోకుండా డేట్లయితే ఇచ్చారు కానీ.. ఇంత తక్కువ సమయంలో సినిమాను సరిగ్గా ప్రమోట్ చేసి బజ్ క్రియేట్ చేయడం, చాలినంత స్థాయిలో థియేటర్లు దక్కించుకుని సినిమా రిలీజ్ చేయడం, ఈ పోటీ మధ్య సక్సెస్ సాధించడం అంత తేలిక కాదని నెమ్మదిగా అర్థమైనట్లుంది.
అందుకే రేసులోంచి ఒక్కో సినిమా తప్పుకోవడం మొదలైంది. పోటీలోకి వచ్చినట్లే వచ్చి సామాన్యుడు, శేఖర్, 7 డేస్ 6 నైట్స్, ఉనికి లాంటి చిత్రాలు తప్పుకున్నాయి. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ మూవీ ‘సూపర్ మచ్చి’ కూడా పక్కకు వెళ్లిపోయింది. చివరికి సంక్రాంతి బంగార్రాజు, డీజే టిల్లు, హీరో, రౌడీ బాయ్స్ మధ్యనే పోటీ అనుకున్నారు. కానీ ఇప్పుడీ మూడు సినిమాల్లోనూ ఒకటి రేసు నుంచి వైదొలగినట్లు వార్తలొస్తున్నాయి.
ఆ ఆ చిత్రమే.. డీజే టిల్లు. ఈ చిత్రాన్ని ‘బంగార్రాజు’, ‘రౌడీ బాయ్స్’కు పోటీగా జనవరి 14న విడుదల చేయాలని అనుకున్నారు. ఈ మేరకే ప్రమోషన్లు కూడా చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సంక్రాంతి పోటీ నుంచి తప్పుకుందట. థియేటర్ల సమస్య తలెత్తిందా.. లేక ఈ పోటీ మధ్య రావడం మంచిది కాదనిపించిందా.. లేక కరోనాకు భయపడ్డారా అన్నది తెలియదు కానీ.. సినిమా అయితే పండక్కి రావట్లేదని అంటున్నారు.
పరిస్థితులను బట్టి జనవరి 26న రిలీజ్ చేయడం.. లేదా నిరవధికంగా వాయిదా వేయడం.. లేదా ఓటీటీ బాట పట్టడం.. ఈ మూడు ఆప్షన్లనూ చిత్ర బృందం పరిశీలిస్తోందట. కాబట్టి చివరికి సంక్రాంతి బరిలో మూడు సినిమాలే నిలవబోతున్నాయన్నమాట. బంగార్రాజు, రౌడీ బాయ్స్ 14న వస్తే.. తర్వాతి రోజు ‘హీరో’ థియేటర్లలోకి దిగుతుంది. ఆయా సినిమాలపై ఉన్న అంచనాల్ని బట్టి చూస్తే ‘బంగార్రాజు’కు ఎదురే ఉండేలా కనిపించట్లేదు.
This post was last modified on January 9, 2022 8:03 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…