మెగా 154లో శృతి హాసన్..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లింది. అక్కడే అవకాశాలు దక్కించుకుంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆమె ఆశించించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయింది. దీంతో మళ్లీ సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ‘క్రాక్’ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా తరువాత శృతికి తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ సరసన ‘సలార్’ సినిమాలో నటించడానికి అంగీకరించింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతో పాటు బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో శృతిని హీరోయిన్ గా తీసుకున్నారు.

మరికొద్దిరోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. 
ఇప్పుడేమో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. బాబీ దర్శకత్వంలో చిరు హీరోగా ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

ఇందులో హీరోయిన్ గా శృతిని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఇంకా ఈ ప్రాజెక్ట్ పై సైన్ చేయలేదట. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. దాదాపు ఆమె ఈ సినిమాలో నటించడం ఖాయమని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రెండు పోస్టర్స్ ను విడుదల చేశారు. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.