ఏపీలో సినిమా టికెట్లకు సంబంధించిన వ్యవహారం ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. ఈ వివాదం మొదలైంది గత ఏడాది వేసవిలో ‘వకీల సాబ్’ రిలీజ్ టైంలో. ఏపీ సీఎం జగన్‌కు రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో దీన్ని టార్గెట్ చేసే క్రమంలో వివాదం రాజుకుంది. ఆ తర్వాత ఈ వివాదం చినికి చినికి గాలి వానలా మారి ప్రతిష్ఠంభన నెలకొనడం తెలిసిందే. ఈ వివాదం పెద్దది కావడానికి ‘రిపబ్లిక్’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం కూడా ఒక కారణమే.
‘వకీల్ సాబ్’ టైంలో పెట్టిన ఆంక్షల్ని ఆ తర్వాత అయినా ఎత్తి వేస్తారేమో అని ఎదురు చూసి.. చివరికి విసిగిపోయిన నేపథ్యంలోనే పవన్ తాడో పేడో తేల్చుకుందామనే రీతిలో ఆ రోజు అలా మాట్లాడారు. ఐతే దీని వల్ల జగన్ సర్కారు మరింత ఇగోకు పోయింది. సమస్యను మరింత జఠిలం చేసింది. ఎవరు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదు. టికెట్ల రేట్ల విషయంలో అస్సలు వెనక్కి తగ్గలేదు. ఐతే ఈ విషయంలో పవన్ కళ్యాణ్‌దే తప్పు అంటున్నారు సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.
ప్రభుత్వాలతో ఘర్షణ వైఖరి ఎప్పుడూ మంచిది కాదని.. తమకు నచ్చని ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ల మీద విమర్శలు చేయకూడదని తమ్మారెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ విమర్శల వల్ల ఇండస్ట్రీతో పాటు ‘రిపబ్లిక్’ సినిమాకు కూడా చాలా నష్టం జరిగిందని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ఆయన అలా ప్రభుత్వాన్ని విమర్శించాలనుకున్నపుడు తన పార్టీ ఆఫీసులో కూర్చుని చేయాల్సిందని, ‘రిపబ్లిక్’ సినిమా ఈవెంట్లో అలా మాట్లాడటం తప్పని ఆయనన్నారు.
దీని వల్ల ‘రిపబ్లిక్’ సినిమాకు చాలా నష్టం జరిగిందని, సాయిధరమ్ తేజ్ భవిష్యత్ దెబ్బ తిందని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. మామూలుగా తేజు సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయని, కానీ పవన్ వ్యాఖ్యల వల్లే ‘రిపబ్లిక్’కు కలెక్షన్లు రాలేదని అన్నారు. పవన్ వ్యాఖ్యల వల్ల వైసీపీ మద్దతుదారుల్లో పది శాతం మంది ఈ సినిమా చూడటం మానేసి ఉన్నా పెద్ద నష్టం జరిగినట్లే అన్నారాయన. పవన్ వ్యాఖ్యలతో ఇండస్ట్రీకి కూడా నష్టం జరిగిందని, సమస్య ఇంకా పెద్దదైందని.. మరోవైపు వైపీపీ మంత్రులు, నాయకులు అనవసర వ్యాఖ్యలతో వివాదాన్ని పెద్దది చేశారని తమ్మారెడ్డి అన్నారు.
This post was last modified on January 4, 2022 7:29 pm
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…