రామ్ గోపాల్ వర్మ గత కొన్నేళ్లలో తీసిన చెత్త సినిమాలు.. రాజేసిన అనవసర వివాదాలు.. చేసిన అర్థం పర్థం లేని కామెంట్ల మూలాన పూర్తిగా తన విలువను కోల్పోయిన మాట వాస్తవం. ఒకప్పుడు వర్మ ఏ సినిమా తీసినా పరుగెత్తుకుని థియేటర్లకు వెళ్లిపోయిన వాళ్లు, ఏం మాట్లాడినా ఆసక్తిగా గమనించిన వాళ్లు ఈ మధ్య ఆయన్ని పూర్తిగా లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. కొందరు రాజకీయ నాయకులను, అలాగే సినీ నటులను ఉద్దేశపూర్వంగా ఆయన టార్గెట్ చేసుకుని చీప్ కామెంట్లు చేయడం వల్ల క్రెడిబిలిటీ పూర్తిగా దెబ్బ తినేసింది.
సినిమాల పరంగా ఆయన ఎంతగా దిగజారిపోయారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ఆయన మాటకు కూడా విలువ పోయింది. ఐతే చాన్నాళ్ల తర్వాత వర్మ ఒక సీరియస్ ఇష్యూ మీద అర్థవంతమైన వ్యాఖ్యలు, వాదనలతో మీడియా ముందుకు వచ్చారు. తనదైన శైలిలో లాజికల్‌గా మాట్లాడుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఆలోచింపజేస్తున్నారు.తెలుగు సినీ పరిశ్రమను తీవ్ర ఇబ్బందుల్లో పడేసిన ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల వ్యవహారంపై రామ్ గోపాల్ వర్మ కొన్ని రోజులుగా చక్కటి వాదన వినిపిస్తున్నారు.
సినిమా తీసే నిర్మాతకు, చూసే ప్రేక్షకుడికి మధ్యన ప్రభుత్వ పెత్తనం ఏంటంటూ ఆయన సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నారు. తాను తీసిన సినిమా క్వాలిటీని బట్టి దానికి ఎంత రేటు నిర్ణయించాలన్నది నిర్మాత ఇష్టమని.. ఆ రేటు తనకు గిట్టుబాటైతే ప్రేక్షకుడు సినిమా చూస్తాడని, లేకుంటే చూడడని.. ఇంత స్పష్టమైన విషయంలో ఈ గందరగోళం ఏంటని, ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటోందని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ ఇష్యూ మీద చాలా లాజికల్‌గా ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తూ వర్మ రిలీజ్ చేసిన వీడియో వైరల్ అయింది. అంతకుముందు వర్మను అస్సలు పట్టించుకోవడం మానేసిన సినీ జనాలు, నెటిజన్లు.. ఈ విషయంలో మాత్రం ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.
చాన్నాళ్ల తర్వాత సినిమా వాళ్లు, పీఆర్వోలు ఆయన వీడియోలను షేర్ చేసి.. వర్మ లేవనెత్తిన పాయింట్లు, ఆయన చేసిన వాదనను కొనియాడుతున్నారు. ఒక టీవీ ఛానెల్ స్టూడియోలో చర్చకు వెళ్లిన వర్మ అక్కడ కూడా బలంగా తన వాదన వినిపించారు. జగన్ సర్కార్ తీరును బాగానే ఎండగట్టారు. దీనికి తోడు ట్వీట్ల ద్వారా కూడా వర్మ అగ్గి రాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీద ప్రశంసలు కురుస్తున్నాయి. దీని మీద పెద్ద ఎత్తున మీమ్స్ కూడా తయారవుతున్నాయి. వర్మ మీద జనాల్లో ఇలాంటి సానుకూల స్పందన చూసి చాలా కాలమే అయింది. ఆయన ఇలాగే ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
This post was last modified on January 4, 2022 5:16 pm
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్‌లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…