యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను థియేటర్లో చూసి చాలా కాలమవుతోంది. ‘అరవింద సమేత’ తరువాత ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయారు ఎన్టీఆర్. 2020లో రిలీజ్ అవుతుందనుకున్న ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా మీద వాయిదా పడుతూనే ఉంది. 2022 జనవరి 7న సినిమా పక్కా రిలీజ్ అవుతుందని చెప్పారు కానీ ఆ డేట్ ను కూడా పోస్ట్ పోన్ చేశారు. ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’ భారీ హిట్ తో మొదలుపెడదామనుకున్న ఎన్టీఆర్ ప్లాన్స్ అన్నీ మారిపోయాయి.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిజల్ట్ ఏంటో తెలియకుండానే కొరటాల శివ సినిమాను మొదలుపెట్టబోతున్నారు. ఈ నెలలోనే సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అయితే ఈ సినిమాతో పాటు మరో ప్రాజెక్ట్ ను కూడా సెట్స్ పైకి తీసుకువెళ్లాలనుకుంటున్నారు ఎన్టీఆర్. ‘ఉప్పెన’ సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా చాలా రోజులుగా ఎన్టీఆర్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఎన్టీఆర్ కి వినిపించేశారు. ఆయనకు కూడా కథ నచ్చింది. కానీ సినిమాను ఎప్పుడు మొదలుపెట్టాలనే విషయంలో క్లారిటీ లేక సైలెంట్ గా ఉండిపోయారు. ఇప్పుడు కొరటాల శివ సినిమాతో పాటు బుచ్చిబాబు సినిమా కూడా స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారట.
బౌండెడ్ స్క్రిప్ట్ రెడీగా ఉండడంతో పక్కా ప్లానింగ్ తో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు.
కొరటాల సినిమా మొదలుపెట్టిన ఒకట్రెండు నెలల్లో బుచ్చిబాబు సినిమా కూడా మొదలవుతుందని సమాచారం. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా ఓ సినిమా కమిట్ అయ్యారు ఎన్టీఆర్. ఆ ప్రాజెక్ట్ వచ్చే ఏడాదిలో మొదలవుతుందని సమాచారం. ఈ రెండేళ్లలో ఎన్టీఆర్ నుంచి మూడు సినిమాలు రావడం పక్కా అని తెలుస్తోంది.
This post was last modified on January 4, 2022 12:12 pm
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…