ఆంధ్రప్రదేశ్లోని పదుల సంఖ్యలో సినిమా థియేటర్లు మూసివేత, టికెట్ రేట్లలో తగ్గింపు గురించి గత కొన్నిరోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ విషయమై పలువురు నటీనటులు స్పందిస్తున్నప్పటికీ ఎలాంటి మార్పులేదు. నిర్మాత దిల్రాజు తాజాగా ప్రెస్మీట్లో దీని గురించి మాట్లాడారు. త్వరలో ఏపీ సీఎం జగన్ను కలుస్తామని చెప్పారు. “ఏపీకి అసలు సమస్య ఏంటో అర్ధం కావడం లేదు. మేం రాజకీయ నేతలం కాదు. ఏ ప్రభుత్వంతోనైనా.. మాపరిధిమేరకే మేం సంబంధం పెట్టుకుంటాం. ఎవరినీ భుజాన వేసుకునే ప్రసక్తి లేదు. అలాగని వైరం కూడా ఉండదు. కానీ, ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ఆవేదన ఆందోళన కూడా కలుగుతోంది“ అని అన్నారు.
“త్వరలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులను కలుస్తాం. అపాయింట్మెంట్ ఇస్తే ఏపీ సీఎం జగన్ను కలుస్తాం. కమిటీ ఏర్పాటు చేస్తే సమస్యల పరిష్కారం సులువవుతుంది. ఎవరూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దని మనవి. ముందుగా అసలు సమస్యలు ఏంటో చర్చిస్తాం. సమస్యలపై ఏపీ సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. మావి పెద్ద పెద్ద సమస్యలు కావు. ప్రేక్షకులకు మంచి సినిమాలు అందిచాలనేదే మా లక్ష్యం. సినీ పరిశ్రమను వివాదాస్పదం చేయొద్దని కోరుతున్నాం. పెద్ద సినిమాలు విడుదల చేయాల్సిందే. సినిమా విడుదలలలో కష్టమైనా, నష్టమైనా ముందుకే వెళ్లాలి” అని దిల్రాజు చెప్పారు.
ఏపీలో థియేటర్, టికెట్ రేట్ల విషయమై త్వరలో ఏపీ సీఎం జగన్ను కలుస్తామని నిర్మాత దిల్రాజు అన్నారు. ఏది ఏమైనా భారీ సినిమాలు విడుదలవుతాయని స్పష్టం చేశారు. అదేసమయంలో టాలీవుడ్లో ఎవరి సమస్యలు వారివేనని.. ఎవరి సినిమా ఆగిపోతే.. వారికిబాధ కలుగుతోందని.. పక్కవారి సినిమా ఆగిపోతే.. మాత్రం ఎవరికీ బాధ ఉండడం లేదని.. విమర్శించారు.
అందరూ కలసి కట్టుగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని.. నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఏ ప్రభుత్వమైనా.. సినిమా రంగంపై సానుకూలంగానే ఉందని.. ఎలాంటి వివక్ష చూపించడం లేదని.. ఈ విషయంలో మీడియా కూడా సినిమా రంగానికి సహకరించాలని కోరారు. ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలుచేయొద్దని.. ముఖ్యంగా ప్రభుత్వాలను విమర్శించడం సరికాదని.. ఏదైనా సమస్య ఉంటే చర్చించి పరిష్కరించుకుందామని.. పలువురు హీరోలకు సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates