ఒకప్పుడు నవలల ఆధారంగా సినిమాలు వచ్చేవి. కానీ ఆ తరువాత నవలల కాన్సెప్ట్ ని పక్కన పెట్టేశారు. ఇప్పుడిప్పుడే మళ్లీ నవలల్ని సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ తీసిన ‘కొండపొలం’ సినిమా సినిమా నవల ఆధారంగా తెరకెక్కించిందే. ఈ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కానప్పటికీ.. విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు క్రిష్ అలాంటి ప్రయత్నమే మరొకటి చేస్తున్నాడు.
ఈసారి ఆయన ‘కన్యాశుల్కం’ కాన్సెప్ట్ ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు సాహిత్యంలో ఈ నవలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గురజాడ అప్పారావు రాసిన ఈ నవల నాటకంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇందులో పాత్రలన్నీ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. డైలాగులను కూడా గుర్తుపెట్టుకునే వారున్నారు. ఈ నవల అంత ఫేమస్.
ఇప్పుడు దీన్ని వెబ్ సిరీస్ గా తెరకెక్కించబోతున్నారు క్రిష్. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ కోసం ‘కన్యాశుల్కం’ని వెబ్ సిరీస్ గా తీయబోతున్నారు క్రిష్. రచన, దర్శకత్వ పర్యవేక్షణ మాత్రం ఆయన చేయబోతున్నారు. దర్శకత్వ బాధ్యతలు వేరొకరికి అప్పగించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రయత్నం సక్సెస్ అయితే ఫ్యూచర్ లో మరిన్ని నవలలు వెబ్ సిరీస్ లుగా వచ్చే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం దర్శకుడు క్రిష్.. పవన్ కళ్యాణ్ హీరోగా ‘హరిహర వీరమల్లు’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొంతవరకు జరిగింది. కొత్త షెడ్యూల్ ను వచ్చే ఏడాదిలో మొదలుపెట్టనున్నారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అర్జున్ రామ్ పాల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates