‘పుష్ప’ సినిమా క్లైమాక్స్ విషయంలో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఈ చిత్రానికి సెకండ్ పార్ట్ కూడా ఉండటంతో దానికి లీడ్ లాగా పతాక ఘట్టాన్ని తీర్చిదిద్దాడు సుకుమార్. ఐతే క్లాస్ ఆడియన్స్ ఆ క్లైమాక్స్ విషయంలో ఓకే అన్నారు కానీ.. మాస్‌కు అది ఎక్కలేదు. యాక్షన్ ప్రధానంగా సాగిన ఈ చిత్రంలో క్లైమాక్స్‌లో భారీతనం లేకపోవడం, యాక్షన్ సీక్వెన్స్ ఏదీ లేకపోవడం..
కేవలం హీరో-విలన్ మధ్య సుదీర్ఘమైన కాన్వర్జేషన్లతో సాగే రెండు సన్నివేశాలతో సినిమాను ముగించడం మాస్ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. నిజానికి పతాక ఘట్టంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ కూడా అనుకున్నారట కానీ.. దాన్ని తెరకెక్కించలేదన్నది చిత్ర వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే క్లైమాక్స్‌లో గన్ను పెట్టి విలన్ బట్టలు విప్పించి.. అతణ్ని నిక్కర్ మీద నిలబెడతాడు హీరో.
తాను కూడా బట్టలు విప్పేసి ఇలాగే ఊర్లోకి వెళ్దాం.. జనం ఎలా స్పందిస్తారో చూద్దాం అని సవాలు విసురుతాడు. ఐతే సినిమాలో ఇలా చూపించినప్పటికీ.. నిజానికి సుకుమార్ ఆలోచన మరోలా ఉందట. హీరో, విలన్ ఇద్దరికీ నిక్కర్లు కూడా తీయించేసి నగ్నంగా నిలబెట్టాలన్నది ఆయన ప్లాన్ అట. ఇలాగే ఊర్లోకి పోదాం పద అని హీరో సవాలు విసిరేలా ఆ సన్నివేశాన్ని తీయాలనుకున్నాడట. కానీ తెలుగు ప్రేక్షకులు ఇలాంటివి తట్టుకోలేరన్న ఉద్దేశంతో ఆ ఆలోచన విరమించుకుని ఇద్దరినీ నిక్కర్లలో చూపించినట్లు సుకుమార్ వెల్లడించాడు.
ఐతే తెలుగులో అనే కాదు.. తమిళంలో అయినా ఈ సన్నివేశాన్ని ఇలా తీస్తే ఓకేనా అన్నది ప్రశ్నార్థకమే. ఎందుకంటే సీరియస్ హార్డ్ హిట్టింగ్ సినిమాల్లో అయితే ఓకే కానీ.. ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైనర్లలో అలాంటి సన్నివేశాలు పెడితే ఎవరికీ అంతగా రుచించకపోవచ్చు. హీరో బట్టల్లేకుండా బండి మీద తన పెళ్లి జరిగే కళ్యాణమండపానికి వస్తే ఏం బావుంటుంది? సుక్కు ఇలా చెప్పినప్పటి నుంచి దీని మీద బోలెడన్ని ఫన్నీ మీమ్స్ వస్తున్నాయి.
This post was last modified on December 26, 2021 2:32 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…