మెగా, నందమూరి హీరోల అభిమానుల మధ్య మామూలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేట్లే ఉంటుంది పరిస్థితి. ఈ రెండు కుటుంబాల హీరోల మధ్య అంత వైరం ఏమీ కనిపించదు కానీ.. వారి అభిమానులు మాత్రం ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో కొట్టేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక ఆన్ లైన్ యుద్ధాలు మరో స్థాయికి వెళ్లిపోయాయి.
ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి మల్టీస్టారర్ చేయబోతున్నట్లు సమాచారం బయటికి వచ్చినపుడు అంతా ఆశ్చర్యపోయారు. ఈ కలయికను వారి వారి అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న సందేహాలు కలిగాయి. కొంతమంది దీన్ని స్వాగతించినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అనుకోవడం.. అవతలి హీరోను తక్కువ చేసి చూపడం ఇప్పటికీ కొనసాగుతోంది.
ఐతే తారక్, చరణ్‌లతో కలిసి సినిమా చేయాలనుకున్నపుడు రాజమౌళికి కూడా అభిమానుల విషయంలో సందేహాలు కలిగాయట. ఇద్దరు హీరోల అభిమానులతో మాట్లాడి ఒక క్లారిటీ తెచ్చుకున్నాకే రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను అనౌన్స్ చేశాడట. తనకైతే అభిమానుల్లో ఈ కాంబినేషన్ విషయంలో అభ్యంతరాలున్నట్లు కనిపించలేదని జక్కన్న చెప్పడం విశేషం.
ఆర్ఆర్ఆర్ చేయాలనుకున్నపుడు ముందు ఇద్దరు హీరోల అభిమానులతోమాట్లాడా. చరణ్ ఫ్యాన్స్‌కు ఫోన్ చేస్తే మా హీరోనే బెస్ట్ అన్నారు. మరి ఎన్టీఆర్ సంగతి ఏంటని అడిగితే.. తారక్ మంచి నటుడే కానీ చరణే బెస్ట్ అన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ అభిమానులను కలిసి మాట్లాడాను. వాళ్లు రామ్ చరణ్ మంచి నటుడు అంటూ, ఎన్టీఆర్ బెస్ట్ అన్నారు. ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని అర్థమైంది.
ఆ తర్వాతే సినిమా గురించి బయటకు చెప్పాను. తారక్, చరణ్ నిజజీవితంలో ఎలా ఉంటారో వాళ్లను, వాళ్ల అభిమానులు కూడా అలానే ఫాలో అవుతున్నారు. ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవనే విషయం నాకర్థమైంది. తారక్, చరణ్ బేసిగ్గా మంచి ఫ్రెండ్స్ అవడం కలిసొచ్చింది, వారి స్నేహాన్నే వెండితెరపై చూపించబోతున్నా’’ అని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
This post was last modified on December 26, 2021 11:09 am
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…