పోయినేడాది కరోనా టైంలో అమేజాన్ ప్రైమ్ ద్వారా రిలీజైన నాని సినిమా వి మీద ఎన్నెన్ని విమర్శలొచ్చాయో తెలిసిందే. నాని కెరీర్లోనే అత్యంత పేలవమైన సినిమాల్లో ఒకటిగా దీన్ని విశ్లేషకులు తీర్మానించారు. నాని ఫ్యాన్స్ ఈ సినిమా చూసి తీవ్ర నిరాశకు గురయ్యారు. ముందు ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసిన వాళ్లు.. తర్వాత ఆ నిర్ణయమే సరైందన్నారు. థియేటర్లలో రిలీజైతే కచ్చితంగా ఇది డిజాస్టర్ అయ్యేదనడంలో సందేహం లేదు.
ఇక నాని తర్వాతి సినిమా టక్ జగదీష్ సైతం ఊహించని విధంగా ఓటీటీ బాటే పట్టింది. వేసవిలో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేయగా.. కరోనా సెకండ్ వేవ్‌తో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తర్వాత మారిన పరిస్థితుల్లో ఆ చిత్రాన్ని కూడా అమేజాన్ ప్రైమ్‌కే ఇచ్చేశారు. దానికి కూడా టాక్ ఏమంత బాగా లేకపోయింది. వి మూవీతో పోలిస్తే మెరుగే అయినప్పటికీ ఇది కూడా థియేటర్లలోకి వస్తే ఫ్లాపే అయ్యేది.
ఐతే నాని మాత్రం ఈ రెండు చిత్రాలకు ఓటీటీలో వచ్చిన స్పందన, ఆ చిత్రాల వల్ల అమేజాన్ ప్రైమ్‌కు జరిగిన లాభం ప్రకారం చూస్తే అవి హిట్లే అంటున్నాడు. కొన్నేళ్ల కిందట అమేజాన్ ప్రైమ్‌లో తన సినిమా ఎంసీఏ రిలీజైనపుడు ఆ ఓటీటీకి కొత్త సబ్‌స్క్రిప్షన్లు బాగా పెరిగాయని.. ఆ తర్వాత వి, టక్ జగదీష్ చిత్రాలకూ సబ్‌స్క్రిప్షన్లు పెరిగాయని.. దీని పట్ల ఓటీటీ నిర్వాహకులు చాలా హ్యాపీ అని.. ఈ సినిమాలు సక్సెస్ అయినందుకు కేక్ కూడా కట్ చేశారని నాని తెలిపాడు.
ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోందని.. థియేటర్ల కోసమే సినిమాలను దాయాల్సిన అవసరం లేదని.. అదే సమయంలో అంతా బాగున్నపుడు థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేయాలని.. శ్యామ్ సింగరాయ్ విషయంలో అదే జరుగుతోందని నాని అన్నాడు. జెర్సీ చూసినపుడు ఎలాంటి భావన కలిగిందో.. శ్యామ్ సింగ రాయ్ చూసినపుడు కూడా అదే ఫీలింగ్ కలిగిందని.. ఇదో గొప్ప సినిమా అవుతుందని నాని ధీమా వ్యక్తం చేశాడు.
This post was last modified on December 22, 2021 8:31 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…