హిందీలో డబ్ అయి యూట్యూబ్‌లో, హిందీ ఛానెళ్లలో ప్రసారమైన తన సినిమాల ద్వారా అల్లు అర్జున్ ఉత్తరాదిన మంచి ఫాలోయింగే సంపాదించాడు. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న టాప్ మూవీస్ లిస్టు తీస్తే బన్నీ సినిమాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ఫాలోయింగ్ చూసే బన్నీ సినిమా నా పేరు సూర్య రిలీజైన చాలా కాలానికి డబ్ చేసి గత ఏడాది థియేటర్లలో రిలీజ్ చేస్తే మంచి స్పందన వచ్చింది.
ఆల్రెడీ దక్షిణాదిన కూడా తన ఫాలోయింగ్ పెరగడంతో పుష్ప సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి డిసైడయ్యాడు బన్నీ. కానీ రిలీజ్‌కు ముందు ఇతర భాషల్లో పెద్దగా హైప్ అయితే కనిపించలేదు. కానీ పుష్ప ఇప్పుడు తెలుగులో కంటే కూడా ఇతర భాషల్లో బాగా ఆడుతున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా హిందీలో ఈ చిత్రం అంచనాల్ని మించి భారీ వసూళ్లు రాబడుతోంది.
పుష్ప హిందీ వెర్షన్ నాలుగు రోజుల్లోనే 16 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి నార్త్ మార్కెట్లో అల్లు అర్జున్ సత్తాను చాటి చెప్పింది.
ఈ చిత్రం అక్కడ ఫుల్ రన్లో 25-30 కోట్ల మధ్య గ్రాస్ కలెక్ట్ చేస్తుందన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ పుష్ప సినిమాను, అల్లు అర్జున్‌ను కొనియాడుతూ ట్వీట్ వేయడం చర్చనీయాంశం అయింది. పుష్ప పోస్ట్ రిలీజ్ ప్రోమోను షేర్ చేస్తూ.. దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందనను రాబట్టుకున్నందుకు అల్లు అర్జున్‌కు అభినందనలని, భారతీయ సినిమాకు ఇది మరో పెద్ద విజయమని, త్వరలోనే ఈ సినిమా చూడాలనుకుంటున్నానని అక్షయ్ ట్వీట్ చేయడం విశేషం.
బాహుబలిని ఓన్ చేసుకున్నట్లుగా పుష్పను కూడా ఓన్ చేసుకుని అక్షయ్ లాంటి పెద్ద బాలీవుడ్ స్టార్ ఇలా ట్వీట్ చేయడం విశేషమే. ప్రమోషన్ కోసం ప్లాన్ చేసిన అక్షయ్‌తో ఇలా ట్వీట్ చేయించినా.. మన సినిమాను, మన హీరోను అంత పెద్ద స్టార్ గుర్తించి పొగడ్డం ప్రత్యేకమైన విషయమే.
This post was last modified on December 22, 2021 4:56 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…
హారర్ కామెడీ జానర్‌లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…