Movie News

బన్నీ కోసం బోయపాటి పీరియాడిక్ ప్లాన్?

ఈమధ్య పీరియాడిక్ ఫిల్మ్స్ ఎక్కువవుతున్నాయి. ఓవైపు రాజమౌళి ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్’ రెడీ చేశారు. ఇటు నాని కూడా ‘శ్యామ్ సింగ రాయ్’గా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ సైతం ఒక పీరియాడిక్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అది కూడా బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో.  రీసెంట్‌గా ‘పుష్ప’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు బన్నీ. దీని తర్వాత పుష్ప సెకెండ్‌ పార్ట్ చేస్తాడని అందరూ అనుకున్నారు.

అయితే మొదటి పార్ట్‌ కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్నా రివ్యూలు కాస్త నెగిటివ్‌గా ఉన్నాయి. అనుకున్న స్థాయిలో సినిమా ఆకట్టుకోలేకపోయిందనే విమర్శలు వస్తున్నాయి. దాంతో కాస్త గ్యాప్ తీసుకుని సెకెండ్ పార్ట్ చేయాలనుకుంటున్నాడట బన్నీ. ఈ గ్యాప్‌లో వేరే సినిమా చేయబోతున్నాడట. దాన్ని డైరెక్ట్ చేసే చాన్స్ బోయపాటికి ఇచ్చినట్లు తెలుస్తోంది.       

అఖండ భారీ విజయం ఇచ్చిన జోష్‌లో ఉన్న బోయపాటి.. రీసెంట్‌గా బన్నీని కలిసి ఓ కథ చెప్పాడట. ఇది ఓ పీరియాడిక్ కాన్సెప్ట్ అని సమాచారం. స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా ఉంటుందట. ఎంత ప్రీ ఇండిపెండెన్స్ స్టోరీయే అయినా బోయపాటి స్టైల్ మాస్ గ్యారంటీ కదా. అందుకే చెప్పగానే బన్నీకి లైన్ నచ్చేసిందట. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా అంటున్నారు.        

నిజానికి బన్నీ కోసం ఐకాన్‌ సినిమా లైన్‌లో ఉంది. కానీ ఎందుకనో ఆ మూవీ విషయంలో తను ముందడుగు వేయడం లేదు. అలా అని ప్రాజెక్ట్ క్యాన్సిలయ్యిందనీ ఒప్పుకోవడం లేదు. దాన్ని అలా పక్కన ఉంచి మిగతా సినిమాలు చేసేస్తున్నాడు. ఈసారి కూడా అదే చేస్తున్నట్టున్నాడు. ఆల్రెడీ బోయపాటితో ‘సరైనోడు’ సినిమా చేశాడు బన్నీ. అది మంచి విజయాన్నే సాధించింది. తనతో మరోసారి మూవీ చేయడమనేది నిజమైతే వీరి కాంబోలో మరో మాంచి ఎంటర్‌‌టైనర్ వచ్చే చాన్స్‌ ఉందన్నమాటే. 

This post was last modified on December 20, 2021 6:39 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

19 minutes ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

2 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

2 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

3 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

6 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

6 hours ago