అంచనాలకు మించి సక్సెస్ అయిన బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారంతో ముగిసింది. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. మరో తొమ్మిది నెలలకు బిగ్ బాస్ సీజన్ 6 షురూ కావాల్సి ఉంటుంది. అయితే.. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో కింగ్ నాగ్.. ఊహించని ప్రకటన చేసి అందరిని షాక్ కు గురి చేశాడు. గ్రాండ్ ఫినాలేలో విజేతగా సన్నీని ప్రకటించే వేళలోనే ఈ ఆసక్తికర ప్రకటన నాగార్జున నుంచి వెలువడింది.
బిగ్ బాస్ సీజన్ 6 తొమ్మిది నెలల తర్వాత షురూ కావాల్సి ఉందని.. కాకుంటే.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా మరో రెండు నెలల్లోనే ప్రారంభమవుతుందని చెప్పటం విశేషం. దీంతో.. 2022లో ఫిబ్రవరిలోనే బిగ్ బాస్ సీజన్ 6 షురూ కానుందని చెప్పాలి.
మరి.. రెండు నెలల వ్యవధిలోనే బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభిస్తామని చెప్పటం చూస్తే.. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆడిషన్స్ మొదలు ఒప్పందాలు కూడా జరిగిపోయినట్లుగా చెప్పాలి. ఎందుకంటే.. బిగ్ బాస్ సీజన్ షురూ కావటానికి ముందు.. బ్యాక్ గ్రౌండ్ వర్కు భారీగా ఉంటుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు బోలెడన్ని చేయాల్సి ఉంటుంది.
కంటెంట్ సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. బిగ్ బాస్ షో పుణ్యమా అని.. స్టార్ మా వ్యూయర్ షిప్ భారీగా పెరగటం.. దాని రన్నింగ్ టైంలో మిగిలిన కార్యక్రమాలన్ని వెలవెలబోవటం.. సోషల్ మీడియాలో సాగిన భారీ బజ్ తో.. సీజన్ 6ను షెడ్యూల్ కంటే చాలా ముందుగా షురూ చేయటం ఆసక్తికరంగా మారింది. చూస్తుంటే.. స్టార్ మా పుణ్యమా అని బిగ్ బాస్ షో చర్చ తెలుగు ప్రజల్లో నిత్యం సాగేలా ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
This post was last modified on December 20, 2021 5:20 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…