Movie News

స్పైడ‌ర్‌మ్యాన్.. మామూలు మోత కాదు

స్పైడ‌ర్ మ్యాన్.. స్పైడ‌ర్ మ్యాన్.. వారం నుంచి ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీ ప్రియుల చ‌ర్చ‌ల‌న్నీ ఈ సినిమా చుట్టూనే తిరుగుతున్నాయి. క‌రోనా త‌ర్వాత అత్య‌ధిక అంచ‌నాలతో విడుద‌లైన హాలీవుడ్ మూవీ ఇదే. మ‌ధ్య‌లో టెనెట్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ స‌హా కొన్ని పెద్ద సినిమాలు రిలీజైనా స‌రే.. వాటికి స్పైడ‌ర్ మ్యాన్ త‌ర‌హాలో క్రేజ్ రాలేదు. పిల్ల‌ల్లో స్పైడ‌ర్ మ్యాన్‌కు ఉన్న ఫాలోయింగే వేరు.

వాళ్లతో పాటు ఫ్యామిలీస్ కూడా స్పైడ‌ర్ మ్యాన్ కోసం థియేట‌ర్ల‌కు ప‌రుగులు పెట్టాల్సిందే. స్పైడ‌ర్ మ్యాన్: నో వే హోమ్ పేరుతో భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఈ మార్వెల్ సినిమా అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని విధంగా ఉండ‌టంతో ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌సూళ్ల మోత మోగిపోయింది. ఇండియాలో పుష్ప లాంటి భారీ చిత్రం పోటీని త‌ట్టుకుని ఈ సినిమా సాగించిన ప్ర‌భంజ‌నం చ‌ర్చ‌నీయాంశం అయింది. 

తొలి రోజే 36 కోట్ల నెట్ వ‌సూళ్లు సాధించి.. వీకెండ్ మొత్తం జోరు కొన‌సాగించిన ఈ చిత్రం.. వంద కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌కు చేరువ‌గా ఉండ‌టం విశేషం. ఇక ప్ర‌పంచ స్థాయిలో స్పైడ‌ర్ మ్యాన్ వ‌సూళ్ల లెక్క‌లు చూసి ట్రేడ్ పండిట్ల‌కు క‌ళ్లు చెదిరిపోతున్నాయి. కేవ‌లం అమెరికాలో మాత్ర‌మే ఈ చిత్రం వీకెండ్లో 253 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేయ‌డం విశేషం. అంటే మ‌న రూపాయ‌ల్లో 1900 కోట్ల పైమాటే అన్న‌మాట‌. ఇక మిగ‌తా ప్ర‌పంచ దేశాల‌న్నింట్లో క‌లిపి ఈ చిత్రం తొలి వారాంతంలో 336 మిలియ‌న్ డాల‌ర్లు (దాదాపు రూ.2550 కోట్లు) కొల్ల‌గొట్టింది.

కేవ‌లం వీకెండ్లోనే ఈ చిత్రం మొత్తంగా 4500 కోట్ల‌కు చేరువ‌గా వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఫుల్ ర‌న్లో ఈ చిత్రం ప‌ది వేల కోట్ల మార్కును అందుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. క‌రోనా త‌ర్వాత వ‌ర‌ల్డ్ వైడ్ అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రం ఇదే అవుతుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇండియాలోనే 150 కోట్ల‌కు అటు ఇటుగా వ‌సూళ్లు రాబ‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

This post was last modified on December 20, 2021 5:14 pm

Share

Recent Posts

సుకుమార్ మీద దేవి ఫ్యాన్స్ ఎటాక్

కొంద‌రు ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…

3 hours ago

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

8 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

12 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

13 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

14 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

15 hours ago