క్యాన్సర్.. ఈ మాట వింటేనే వెన్నులోంచి వణుకు పుడుతుంది. ఇప్పటికీ మెడికల్ సైన్స్‌కి అంతు చిక్కని ఈ వ్యాధి నిత్యం ఎందరినో కబళిస్తోంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోని పలువురు ఇప్పటికే క్యాన్సర్ బారిన పడ్డారు. కొందరు దాన్ని జయించారు. కొందరు పోరాడుతున్నారు. ఇప్పుడు మరో నటి కూడా క్యాన్సర్ బారిన పడింది. తనే హంసానందిని. తనకి బ్రెస్ట్ క్యాన్సర్ సోకినట్టు ఆమే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది.
హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా కోరుకున్న విజయం దక్కలేదు హంసకి. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. ఐటమ్ సాంగ్స్‌తో ఎక్కువ పాపులర్ అయ్యింది. అంతా బానేవుంది అనుకుంటున్న సమయంలో ఈ భయంకర వ్యాధి ఆమె శరీరంలోకి ప్రవేశించింది. నాలుగు నెలల క్రితం తన బ్రెస్ట్‌లో ఒక లంప్ ఉన్నట్టు హంస గుర్తించింది. టెస్టులు చేయిస్తే క్యాన్సర్ అని తేలింది. అప్పటి నుంచి ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది.
‘ఎన్ని సమస్యలైనా రానియ్. జీవితం నా పట్ల ఎంత నిర్దయగా అయినా ఉండనియ్. నేను కుంగిపోను. భయం, బాధ, నెగిటివిటీలను నా దగ్గరకు రానివ్వను. నన్ను జయించే అవకాశం ఈ వ్యాధికి నేను ఇవ్వను. ధైర్యంతో, ప్రేమతో నేను ముందుకే వెళ్తాను’ అంటూ ధైర్యంగా తన పరిస్థితి గురించి పోస్ట్ చేసింది నందిని. ఈ సందర్భంగా జుట్టంతా రాలిపోయి గుండుతో ఉన్న ఫొటోని కూడా షేర్ చేసిందామె.
దురదృష్టంకొద్దీ హంసానందిని తల్లి బ్రెస్ క్యాన్సర్‌తోనే కొన్నేళ్ల క్రితం చనిపోయారు. హంసకి కూడా అదే సమస్య వచ్చింది. కన్‌ఫర్మ్ అయిన వెంటనే సర్జరీ చేసి ట్యూమర్‌ని తీసేశారు. ఇప్పటి వరకు తొమ్మిది కీమోథెరపీలు జరిగాయి. ఇంకో ఏడు జరగాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ప్రమాదం లేదు కానీ మరోసారి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు డెబ్భై శాతం, ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు నలభై అయిదు శాతం ఉన్నాయని డాక్టర్స్ చెప్పారట. అంటే జీవితాంతం తను జాగ్రత్తగానే ఉండాలి.
ఇంత జరిగినా తాను ధైర్యంగానే ఉన్నానని హంస చెబుతోంది. దీనివల్ల తాను కుమిలిపోనని, పూర్తిగా కోలుకుని తనలాంటి వారందరికీ ధైర్యాన్నిస్తానని అంటోంది. అంతేకాదు.. వీలైనంత త్వరలో మళ్లీ కెమెరా ముందుకు వస్తానని, ఎప్పటిలానే వెండితెరపై మెరిసి మెప్పిస్తానని చెబుతోంది. అలాగే జరగాలని, హంస వెంటనే కోలుకోవాలని మనమూ ప్రార్థిద్దాం.
This post was last modified on December 20, 2021 1:44 pm
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…
ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను…
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…
అమెరికా ఇటీవల భారత్‌కు చెందిన అక్రమ వలసదారులను ప్రత్యేక విమానంలో పంపిన నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్…