ఆర్.ఆర్.ఆర్. చిత్రానికి సంబంధించిన ఏ విషయాన్ని అయినా చాలా ఘనంగా, ఒక హైప్ తో అనౌన్స్ చేయాలని రాజమౌళి చూస్తున్నాడు. అందుకే ఈ చిత్రం గురించిన అన్ని విషయాలు ట్విట్టర్ హ్యాండిల్ ద్వారానే చెబుతున్నారు. చివరకు ఎన్టీఆర్, చరణ్ కూడా ఈ సినిమాకు సంబంధించి ఏమి అడిగినా అన్నీ రాజమౌళికే తెలుసు అంటూ తప్పించుకుంటున్నారు. అంతెందుకు బాలీవుడ్ మీడియా కూడా అజయ్ దేవగన్ నుంచి తన పాత్రకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పించలేకపోయింది. కానీ ఈ చిత్రంలో అతనికి జోడీగా నటిస్తున్న శ్రియ ఆ విషయాన్ని లీక్ చేసేసింది.
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అజయ్ సరసన కనిపిస్తా అంటూ వీడియోలో చెప్పింది. ఇది రాజమౌళికి అసలు నచ్చలేదు. అతని టీమ్ నుంచి శ్రియకి స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్లిందని, ఇలాంటివి రిపీట్ అయితే రీప్లేస్ చేయడానికి కూడా వెనుకాడమని గట్టిగా చెప్పారట. సీనియర్ నటి కనుక ఇలాంటి ప్రోటోకాల్స్ తెలిసే ఉంటాయని ఆమెకి ప్రత్యేకించి సీక్రెట్ గా ఉంచాలని చెప్పలేదట. పెద్ద సినిమాలో ఆఫర్ కావడంతో శ్రియ ఎక్సయిట్మెంట్ ఆపుకోలేకపోయింది పాపం.
Gulte Telugu Telugu Political and Movie News Updates