విజయ్ కోసం మహానటి

మహానటి తర్వాత ఫిమేల్ సెంట్రిక్ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టినా.. కమర్షియల్ సినిమాలకు కూడా ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్‌గానే ఉంది కీర్తి సురేష్. నితిన్‌ లాంటి యంగ్‌ హీరోలతో పాటు మహేష్‌ బాబు లాంటి స్టార్ హీరోల సరసన కూడా మెరిసి మురిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ దూకుడు చూపిస్తోంది.                 

త్వరలో ఓ తమిళ స్టార్ హీరోతో కలిసి ఆమె నటించబోతోందనే వార్తలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు.. విజయ్. ప్రస్తుతం బీస్ట్ చిత్రంలో నటిస్తున్న విజయ్.. తర్వాత వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీ చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్‌గా కీర్తిని తీసుకున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.       

ఎట్టకేలకి దీనిపై విజయ్ టీమ్ రియాక్టయ్యింది. కీర్తిని హీరోయిన్‌గా తీసుకోవడం నిజం కాదని, ఇంకా హీరోయిన్‌ కన్‌ఫర్మ్ కాలేదని, కాగానే చెబుతామని క్లారిటీ ఇచ్చింది. దాంతో పుకార్లకి ఫుల్‌స్టాప్ పడింది. ఈ మూవీని అనౌన్స్ చేసి చాలా కాలమైంది. కానీ ఇంతవరకు కాస్ల్ అండ్ క్రూ గురించి ఎటువంటి ప్రకటనా లేదు. అందుకే ఇలాంటి వార్తలు పుట్టుకొస్తున్నాయి.       

అయినా విజయ్ సరసన కీర్తి నటించడమనేది ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ విషయమో అరుదైన విషయమో కాదు. ఎందుకంటే వీళ్లిద్దరూ మొదటిసారి జోడీ కట్టడం లేదు. ఆల్రెడీ సర్కార్‌‌ మూవీలో కలిసి నటించారు. కాబట్టి ఒకవేళ ఈ వార్త నిజమై ఉంటే కాంబో రిపీట్ అయ్యుండేదంతే. కాదని ఇప్పుడు తేలిపోయింది కనుక ఆ ప్లేస్ ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.