Movie News

బన్నీ ఫ్యాన్స్‌కు ఇది నిరాశే

టాలీవుడ్ అనే కాదు.. ఇండియా మొత్తంలో బెస్ట్ డ్యాన్సర్లలో అల్లు అర్జున్ ఒకడు. అతడి ప్రతి సినిమాలోనూ డ్యాన్సులకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. మంచి డ్యాన్స్ నంబర్ పడితే బన్నీ మోత మోగించేస్తాడు. ఊర మాస్ డ్యాన్స్ చేయాలన్నా సరే.. క్లాస్‌గా స్టెప్స్ వేయాలన్నా సరే.. తనకు తానే సాటి అన్నట్లుగా అదరగొట్టేస్తుంటాడు బన్నీ. తన చివరి సినిమా ‘అల వైకుంఠపురములో’లో పాటలన్నీ చాలా క్లాస్‌గా సాగగా.. వాటికి తగ్గ స్టెప్స్‌తో బన్నీ అదరగొట్టాడు. అందులోని కొన్ని స్టెప్స్ సోషల్ మీడియాను ఎలా ఊపేశాయో తెలిసిందే.

ఇప్పుడు బన్నీ.. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ లాంటి మాస్ మూవీ చేస్తుండటంతో ఇందులో మంచి ఊపున్న పాటలుంటాయని.. వాటిలో బన్నీ తనదైన శైలిలో స్టెప్పులతో అదరగొట్టేస్తాడని అంచనా వేశారు. ఐతే పాటల్లో అనుకున్నంత ఊపు లేకపోవడం కొంత నిరాశ పరిచే విషయం అయితే.. వాటిలో బన్నీ ఫ్రీగా స్టెప్స్ వేయలేని ఇబ్బంది తలెత్తడం అతడి అభిమానులను మరింత నిరాశకు గురి చేస్తోంది.

‘రంగస్థలం’లో హీరోను చెవిటివాడిగా చూపించిన సుక్కు.. ‘పుష్ప’లోనూ హీరోకు ఒక వైకల్యం పెట్టాడు. బన్నీని కొంచెం గూనివాడిలాగా చూపించాడు. ఈ సినిమా ప్రోమోలన్నింట్లో బన్నీ భుజం పైకెత్తి కనిపిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా మొత్తంలో దీన్ని అలాగే మెయింటైన్ చేశాడు. దాని వల్ల ఫ్రీగా స్టెప్స్ వేయలేని ఇబ్బంది తలెత్తింది. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన పాటలు వేటిలోనూ బన్నీ పెద్దగా స్టెప్స్ ఏమీ వేయలేదు. హీరో ఇంట్రో సాంగ్ అయిన దాక్కో దాక్కో మేకలో కూడా బన్నీ చిన్న హుక్ స్టెప్ ఒకటి వేశాడు.

శ్రీవల్లి పాటలో విడిపోయిన చెప్పు వేసుకుంటూ కొంచెం ఫన్నీగా అనిపించే స్టెప్ ఒకటి ట్రై చేశాడు. ఇవేవీ కూడా బన్నీ స్థాయిలో లేవు. ఏయ్ బిడ్డా పాటలో కూడా మేనరిజమ్స్ మీద దృష్టిపెట్టారే తప్ప.. డ్యాన్సులేసే పాటలా అనిపించలేదది. తాజాగా రిలీజ్ చేసిన ఐటెం సాంగ్‌లో కూడా అనుకున్నంత ఊపు లేదు. బన్నీ ఇందులోనూ స్టెప్పులేసేలా కనిపించడం లేదు. మొత్తానికి ఇలాంటి ఊరమాస్ సినిమాలో బన్నీ లాంటి టాప్ డ్యాన్సర్‌కు తన టాలెంట్ చూపించే అవకాశం లేకుండా తన పాత్రకు లిమిటేషన్ పెట్టడం అభిమానులకు నిరాశ కలిగించేదే.

This post was last modified on December 12, 2021 9:28 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

7 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

8 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

8 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

9 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

9 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

9 hours ago