సునీల్ రోల్ బన్నీకి తెగ నచ్చేసిందట!

ఒకప్పుడు కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసిన సునీల్ ఆ తరువాత హీరోగా మారాడు. ఈ క్రమంలో రెండు, మూడు హిట్లు కూడా వచ్చాయి. కానీ హీరోగా కెరీర్ ను కంటిన్యూ చేయలేకపోయాడు. వరుస ఫ్లాప్ లు రావడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారమెత్తాడు.

విలన్ గా కూడా సినిమాలు చేశాడు. ఈ పాత్రలు క్లిక్ అవ్వడంతో సునీల్ కి పెద్ద, పెద్ద సినిమాల్లో ఛాన్స్ లు వస్తున్నాయి. సుకుమార్ డైరెక్ట్ చేసిన ‘పుష్ప’ సినిమాలో సునీల్ కీలకపాత్ర పోషించాడు.

ఇటీవల విడుదలైన ట్రైలర్ లో సునీల్ కొన్ని డైలాగ్స్ చెబుతూ కనిపించారు. ఆయన గెటప్, చిత్తూరు యాసలో మాట్లాడిన తీరు అతడి పాత్రపై ఆసక్తిని క్రియేట్ చేసింది. ఈ రోల్ సునీల్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు.

హీరో అల్లు అర్జున్ కూడా సునీల్ పెర్ఫార్మన్స్ చూసి ఆశ్చర్యపోయారట. ఇటీవల తన పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి వెళ్లిన బన్నీ.. అప్పటికే డబ్బింగ్ పూర్తి చేసిన సునీల్ కి సంబంధించి కొన్ని సీన్లు చూశారట.

అందులో సునీల్ పెర్ఫార్మన్స్ కి బన్నీ ఫిదా అయిపోయారట. వెంటనే సుకుమార్ కి ఫోన్ చేసి సునీల్ పాత్ర చాలా బాగా వచ్చిందని.. అసలు ఊహించలేదని అన్నారట. బన్నీ అంతగా మెస్మరైజ్ అయిపోయారంటే సునీల్ ఏ రేంజ్ లో పెర్ఫార్మ్ చేసి ఉంటారో ఊహించుకోవచ్చు.

మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈరోజు సినిమాలో ఐటెం సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.