కొంత కాలంగా ఇమేజ్ బిల్డప్, సొంత బ్రాండింగ్ మీద అల్లు అర్జున్ బాగా శ్రద్ధ పెడుతున్నాడు. ఇంతకుముందులాగా అతను ‘మెగా’ నీడలో ఉండటానికి ఇష్టపడట్లేదు. మిగతా మెగా హీరోల్లాగా ఆ పదం వాడట్లేదు. గతంలో అభిమానుల గురించి మాట్లాడేటపుడు మెగా అభిమానులు అనేవాడు. కానీ ఈ మధ్య అల్లు ఆర్మీ అంటున్నాడు. ‘అల్లు’ ఫ్యామిలీ అనే మాట వాడకం కూడా ఎక్కువగా ఉంటోంది.
మెగాస్టార్ చిరంజీవి మీద అప్పుడప్పుడూ తన గౌరవభావాన్ని చాటుకుంటూనే.. తన సొంత ఇమేజ్ బిల్డప్ కోసం బన్నీ ప్రయత్నిస్తున్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. తన సినిమాల వేడుకలకు కూడా అతిథులను పిలవడం మానేశాడు బన్నీ. గతంలో చాలాసార్లు చిరంజీవి అతడి సినిమాల వేడుకలకు గెస్ట్‌గా రావడం తెలిసిందే. ఐతే ఇప్పుడు బన్నీ వేరే వేడుకలకు అతిథిగా వెళ్తున్నాడే తప్ప తన సినిమాల వేడుకలకు చీఫ్ గెస్ట్‌లను పిలవట్లేదు.
గత ఏడాది సంక్రాంతి టైంలో మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్తే.. బన్నీ మాత్రం ఏ గెస్ట్ లేకుండా తన సినిమా ‘అల వైకుంఠపురములో’ ఈవెంట్ చేసుకున్నాడు. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. తన సినిమాలకు తన ప్రమోషన్ చాలని.. ఎవరూ వచ్చి దానికి హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదని బన్నీ ఫీలవుతుండొచ్చు. ‘అల..’ విషయంలో తన నమ్మకం ఫలించడంతో ‘పుష్ప’ సినిమా విషయంలోనూ ఇదే ఒరవడి కొనసాగిస్తున్నాడు.
ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి, ప్రభాస్‌లతో పాటు ఓ బాలీవుడ్ హీరో కూడా ముఖ్య అతిథులుగా వస్తారని కొన్ని రోజుల కిందట మీడియాలో ఊదరగొట్టేశారు. కానీ తీరా చూస్తే ఏ గెస్ట్ లేకుండానే ఈ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ నెల 13న యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ ఈవెంట్ జరగనుంది. సంబంధిత పోస్టర్లలో ఎక్కడా ఫలానా వారు చీఫ్ గెస్ట్‌గా రాబోతన్నారన్న సమాచారం లేదు. తన సినిమాల ప్రమోషన్‌కు తనకు మించి ఎవరూ అవసరం లేదని బన్నీ బలంగా ఫిక్సయ్యాడనడానికి ఇది సూచిక.
This post was last modified on December 10, 2021 4:43 pm
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…
నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…