బాలీవుడ్ క్లాసిక్స్‌లో ఒకటైన ‘ఇక్బాల్’ మూవీతో మంచి పేరు సంపాదించిన నటుడు శ్రేయస్ తల్పాడే. ఆ తర్వాత గోల్ మాల్ సిరీస్‌తో.. ఇంకా ఓం శాంతి ఓం, హౌస్ ఫుల్ లాంటి చిత్రాలతో శ్రేయస్ బాగానే పాపులర్ అయ్యాడు. ఈ నటుడు ఇప్పుడు మన అల్లు అర్జున్‌కు డబ్బింగ్ చెబుతుండటం విశేషం. బన్నీ కొత్త చిత్రం ‘పుష్ప’ పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటే హిందీలో తొలిసారి నేరుగా రిలీజవుతున్న బన్నీ సినిమా ఇదే.
హిందీలో తెలుగు డబ్బింగ్ చిత్రాలను యూట్యూబ్‌లో రిలీజ్ చేసి బాగా పాపులారిటీ సంపాదించిన గోల్డ్ మైన్ ఫిలిమ్స్ ‘పుష్ప’ హిందీ హక్కులను సొంతం చేసుకోగా.. నార్త్ మార్కెట్లో పేరుమోసిన సంస్థ అయిన ఏఏ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. వీళ్లు ‘పుష్ప’ హిందీ డబ్బింగ్ విషయంలో బాగానే శ్రద్ధ పెట్టినట్లున్నారు. మామూలుగా హిందీ డబ్బింగ్ చిత్రాల కోసం పని చేసే రెగ్యులర్ డబ్బింగ్ ఆర్టిస్టులతో లాగించేయకుండా బన్నీ పాత్రకు శ్రేయస్ లాంటి పేరున్న నటుడితో డబ్బింగ్ చెప్పించడం విశేషం.
‘పుష్ప’ హిందీ ట్రైలర్‌ను లాంచ్ చేస్తూ ఈ విషయాన్ని శ్రేయసే వెల్లడించాడు. ఇండియాలోనే మోస్ట్ పవర్ ఫుల్, స్టైలిష్ స్టార్ అయిన అల్లు అర్జున్‌కు వాయిస్ ఇచ్చినందుకు తాను చాలా గర్విస్తున్నానంటూ మన హీరోకు ఎలివేషన్ ఇచ్చాడు శ్రేయస్. అతను డబ్బింగ్ చెప్పిన తొలి తెలుగు చిత్రం ఇదేనట. ఇంతకుముందు ‘లయన్ కింగ్’ కోసం తొలిసారి డబ్బింగ్ చెప్పాడు శ్రేయస్.
‘పుష్ప’ హిందీ ట్రైలర్ ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ కాగా.. నార్త్ ఇండియన్స్ నుంచి రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. సెలబ్రెటీలు సైతం దీని గురించి పాజిటివ్‌గా ట్వీట్ చేస్తున్నారు. డబ్బింగ్ సినిమాలతో నార్త్ ఇండియాలో మంచి గుర్తింపు సంపాదించిన బన్నీ.. ‘పుష్ప’తో అక్కడ ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి. ఈ చిత్రం డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 8, 2021 2:00 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…