ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు రాయలసీమలోని కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. వరదల ధాటికి వందలాదిమంది నిరాశ్రయులు కాగా…62మంది వరకు మృత్యువాతపడ్డారు. వందల ఎకరాల్లో పంట నష్టం, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది.
ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ హీరోలు తమ వంతు సాయాన్ని ప్రభుత్వానికి అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరద బాధితులకు రూ.1 కోటి ఆర్థిక సాయం అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆ నగదు మొత్తాన్ని అందజేస్తున్నట్లు ప్రభాస్.
ఇప్పుడే కాదు, గతంలో హైదరాబాద్ వరద బాధితుల సహాయార్థం,, కరోనా విపత్తు సమయంలోనూ ప్రభాస్ భారీ విరాళం అందించాడు. తాజాగా ప్రభాస్ భారీ మొత్తంలో విరాళమివ్వడంతో ఆయన ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. విరాళం ఇవ్వడంలోనూ ప్రభాస్ బాహుబలే అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
కాగా, అంతకుముందు వరద బాధితులకు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, సూపర్ స్టార్ మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ లు తలా రూ.25 లక్షల చొప్పున విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ తర్వాత మరికొంతమంది టాలీవుడ్ ప్రముఖులు కూడా ఇదే బాటలో వరదబాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates