ఎంత పెద్ద దర్శకుడికైనా ప్రతిసారీ అంచనాలను అందుకోవడం అంటే అంత సులువు కాదు. అందులోనూ ఓ సినిమా మొదలవడంతోనే అంచనాలు నెలకొని.. రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి అవి కొన్ని రెట్లు పెరిగిపోతే అప్పుడు ఆశల్ని నిలబెట్టడం చాలా కష్టమే అవుతుంది. కానీ బోయపాటి శ్రీను మాత్రం అభిమానుల ఆకాంక్షలను నిలబెట్టాడు. బాలయ్యతో ఇప్పటికే సింహా, లెజెండ్ లాంటి బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన బోయపాటి.. అఖండతోనూ హ్యాట్రిక్ కొట్టినట్లే కనిపిస్తున్నాడు.
కామన్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా సరే.. అభిమానులకు మాత్రం అఖండ ఒక పండుగ లాగే ఉంది. బాలయ్యను ఎలా చూడాలనుకుంటారో అలా.. ఫుల్ ఎనర్జీతో చూపించడం.. బోయపాటితో సినిమా అనేసరికి వేరే లెవెల్లో పెర్ఫామ్ చేసే బాలయ్య కూడా అఖండ పాత్రలో విజృంభించడంతో థియేటర్లలో అభిమానులకు పూనకాలు వచ్చేస్తున్నాయి.
సమీక్షకులు ఏమన్నా.. నాన్ ఫ్యాన్స్ ఎలాంటి కామెంట్లు చేసినా.. అభిమానులు మాత్రం అఖండ విషయంలో మామూలు ఆనందంలో లేరు. మళ్లీ మళ్లీ షోలు రిపీట్ చేస్తున్నారు. థియేటర్లలో వాళ్ల సంబరాలు మామూలుగా లేవు. రూలర్ సినిమా చూసి బాలయ్య పనైపోయిందన్న వాళ్లంతా.. ఇప్పుడు థియేటర్లలో ఆ హంగామా చూసి, సినిమాకు వస్తున్న ఓపెనింగ్స్ చూసి నోరెళ్లబెడుతున్నారు. ఇదంతా కచ్చితంగా బోయపాటి మహిమే అనడంలో సందేహం లేదు.
బోయపాటితో బాలయ్య సినిమా అనగానే ఆటోమేటిగ్గా హైప్ వచ్చేసింది. ప్రోమోలతో ఆ హైప్‌ను ఇంకా ఇంకా పెంచడంలో బోయపాటి విజయవంతం అయ్యాడు. ఇక సినిమా అంతటా మాస్ మూమెంట్స్, ఎలివేషన్లు, అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్ ఉండటంతో అభిమానులు, మాస్ ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. తమ నమ్మకాన్ని నిలబెడుతూ.. మళ్లీ బాలయ్య కెరీర్‌కు మంచి ఊపు ఇచ్చిన బోయపాటిపై బాలయ్య అభిమానుల అభిమానం అంతా ఇంతా కాదు. వాళ్లు ఆయనకు తమ గుండెల్లో ఎప్పుడో గుడి కట్టేశారు. బయట కూడా అదే పని చేస్తారేమో అన్నట్లుంది పరిస్థితి.
This post was last modified on %s = human-readable time difference 11:32 am
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్…
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా…
సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. తనతో సినిమా చేయడానికి టాప్ స్టార్లు ఎంతో…
తండేల్ విడుదల తేదీ సస్పెన్స్ కు చెక్ పెడుతూ ఫిబ్రవరి 7 అఫీషియల్ గా ప్రకటించారు. నిన్నే ఇది లీకైనప్పటికీ…
రాజకీయాల్లో తప్పొప్పులు అనేవి ఉండవు. నేడు తాను చేసింది రైట్ అనిపించిన నాయకుడికి… తదుపరి అదే పనిని తన ప్రత్యర్థి…
ఏదైనా వేదిక ఎక్కి మైక్ పట్టుకున్నపుడు, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు కొందరికి పూనకాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు నోటికి…