ఆంధ్రప్రదేశ్‌లో ఏ భారీ చిత్రం రిలీజైనా ముందు రోజు అర్ధరాత్రి నుంచి హంగామా మొదలైపోతుంది. తెల్లవారుజామున పెద్ద ఎత్తున అభిమానుల కోసం బెనిఫిట్ షోలు వేయడం ఎప్పట్నుంచో వస్తున్న సంప్రదాయం. కానీ ఈ సంప్రదాయానికి ఈ ఏడాది వేసవిలో బ్రేక్ పడింది. పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’కు ఏపీలో ప్లాన్ చేసిన బెనిఫిట్ షోలన్నీ రద్దయిపోయాయి. అంతే కాక ఉదయం మార్నింగ్ షోల కంటే ముందు ప్లాన్ చేసిన షోలు, వేరే ఎక్స్‌ట్రా షోలన్నీ కూడా క్యాన్సిల్ చేసేశారు. టికెట్ల రేట్ల మీద కూడా నియంత్రణ తెచ్చారు. ఇది పవన్ అభిమానులకు తీవ్ర ఆగ్రహావేశాలు తెప్పించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ తర్వాత ఏపీలో ఇకపై బెనిఫిట్ షోలనేవే ఉండవని మంత్రి పేర్ని నాని తేల్చేశారు. ఈ మేరకు ఇటీవల జీవో కూడా రిలీజ్ చేశారు. రోజుకు నాలుగు షోలు మాత్రమే ఉంటాయని.. అదనపు షోలకు కూడా ఛాన్స్ లేదని తేల్చి చెప్పారు. అలాగే టికెట్ల రేట్ల విషయంలోనూ నియంత్రణ తీసుకొస్తూ జీవో రిలీజ్ చేయడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ‘అఖండ’ విషయంలో ఏం జరుగుతుందా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ చిత్రానికి బెనిఫిట్ షోలు, అదనపు షోలు లేవనే ఫిక్సయిపోయారు. కానీ ఏపీలో ఈ రోజు చాలా చోట్ల బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు పడటం విశేషం. తిరుపతి సిటీలో అందుబాటులో ఉన్న ప్రతి థియేటర్‌లోనూ ‘అఖండ’ సినిమానే వేశారు. అంతే కాక మార్నింగ్ షోకు ముందు స్పెషల్ షోలు షెడ్యూల్ చేశారు. వాటికి ఆన్ లైన్ బుకింగ్స్ కూడా జరిగాయి. అంతే కాక తెల్లవారుజామున అభిమానుల కోసం బెనిఫిట్ షోలు కూడా ప్లాన్ చేశారు. ఐతే ముందు రోజు రాత్రి మాత్రం ఈ షోల విషయంలో సందిగ్ధత నడిచింది. ఒక దశలో ఈ షోలన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయనే ప్రచారం జరిగింది. కానీ చివరికి తెల్లవారుజామున ఐదు గంటలకు చాలా థియేటర్లలో బెనిఫిట్ షోలు పడ్డాయి. ఉదయం అదనపు షోలు కూడా షెడ్యూల్ ప్రకారమే నడిచాయి.
తిరుపతి అనే కాదు.. ఏపీలో చాలా చోట్ల బెనిఫిట్ షోలు, అదనపు షోలు వేశారు. వీటికి ఎక్కడిక్కడ లోకల్ యంత్రాంగం నుంచి అనుమతులు తెచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం వైపు నుంచి పెద్దగా అభ్యంతరాలు లేనట్లే కనిపిస్తోంది. తర్వాతి భారీ చిత్రం ‘పుష్ప’.. ఆపైన వచ్చే ‘ఆర్ఆర్ఆర్’కు కూడా బెనిఫిట్, స్పెషల్ షోలకు ఇబ్బంది ఉండదనే భావిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ సినిమా ‘భీమ్లా నాయక్’ విషయంలోనే సందేహాలున్నాయి. ‘వకీల్ సాబ్’ను టార్గెట్ చేసినట్లే ఉద్దేశపూర్వకంగా దీన్ని కూడా టార్గెట్ చేస్తారా.. లేక దానికి కూడా అనధికార మినహాయింపునిచ్చేస్తారా అన్నది చూడాలి.
This post was last modified on December 2, 2021 5:34 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…