‘ఆచార్య’ సినిమాలో రామ్ చరణ్ చేస్తున్న సిద్ధ పాత్ర విషయంలో మెగా అభిమానులే కాదు.. సగటు సినీ ప్రేక్షకులందరూ అమితాసక్తితో ఉన్నారు. చిరు-చరణ్‌లను స్క్రీన్ మీద చూడటం ఎవరికైనా ఆనందాన్నిచ్చే విషయమే. ఇంతకుముందు ‘మగధీర’, ‘ఖైదీ నంబర్ 150’ చిత్రాల్లో కొన్ని నిమిషాలు మాత్రమే ఈ తండ్రీ కొడుకులు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ ‘ఆచార్య’ సంగతి అలా కాదు. ఇందులో చరణ్ ఓ కీలక పాత్రనే పోషిస్తున్నాడు. దాని నిడివి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉండబోతోందని అర్థమవుతోంది.
ఇటీవలే రిలీజ్ చేసిన సిద్ధ పాత్ర తాలూకు టీజర్ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూల ో చరణ్ ఈ పాత్ర గురించి మరిన్ని విశేషాలు వెల్లడించాడు. ఆ కబుర్లు తన పాత్రపై, సినిమాపై మరింత అంచనాలు పెంచేలాగే ఉన్నాయి.
సిద్ధ పాత్రను ముందు క్యామియో రోల్ అనే అనుకున్నామని.. తర్వాత దాని నిడివి పెరిగి మొత్తంగా 40 నిమిషాల పాటు ఆ పాత్ర సినిమాలో కనిపిస్తుందని చరణ్ వెల్లడించాడు. ఈ పాత్ర ప్రథమార్ధంలో ఉండదని.. ద్వితీయార్ధంలో ప్రవేశిస్తుందని చరణ్ చెప్పాడు. ద్వితీయార్ధం మొత్తం ఈ పాత్ర ఉన్న ఫీలింగ్ కలుగుతుందని.. కథలో ఈ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని చరణ్ తెలిపాడు. ఆచార్య పాత్ర మొదలుపెట్టే ఒక పెద్ద మూమెంట్‌ను సిద్ధ క్యారెక్టర్ ముందుకు తీసుకెళ్తుందని చరణ్ వెల్లడించాడు.
తనది ఇందులో చిరు వారసత్వాన్ని కొనసాగించే కామ్రేడ్ పాత్ర అని కూడా చరణ్ తెలిపాడు. ఈ మాటలు మెగా అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచేవే. ఇటీవల రిలీజ్ చేసిన సిద్ధ టీజర్లో పులి-పులి పిల్లల్ని చూపించి ఆ వెంటనే చిరు-చరణ్‌లను చూపించిన షాట్ వారికి మామూలు హైని ఇవ్వలేదు. సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేలా చేసిందా టీజర్. సినిమాలో వీళ్లిద్దరి మీదా ఒక పాట కూడా ఉంటుందని కొరటాల చెబుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 4న ‘ఆచార్య’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 1, 2021 10:35 pm
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…