మన హీరోలు వెళ్లి బాలీవుడ్ చిత్రాల్లో కీలక పాత్రలు చేయడం తరచుగా జరుగుతూ ఉంటుంది. కానీ బాలీవుడ్ హీరోలు వచ్చి మన సినిమాల్లో నటించడం చాలా అరుదు. అందులోనూ సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు అలా చేస్తారని అస్సలు ఊహించలేం. కానీ చిరంజీవి దాన్ని సాధ్యం చేశారు. ఆయన నటిస్తున్న ‘గాడ్‌ఫాదర్’లో సల్మాన్ నటిస్తున్నాడు. అయితే రీసెంట్‌గా తెలిసిన ఫ్లాష్ న్యూస్ ఏంటంటే.. వెంకటేష్‌తో కూడా సల్మాన్ వర్క్ చేయబోతున్నాడు.
‘అంతిమ్’ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చాడు సల్మాన్. తన బావమరిది ఆయుష్ శర్మ, చిత్ర దర్శకుడు మహేష్ మంజ్రేకర్‌లతో కలిసి తెగ సందడి చేశాడు. ఈ సందర్భంగా మీడియాతో కాసేపు ముచ్చటించాడు కూడా. అప్పుడే తెలుగులో సినిమాల్లో నటించడం గురించి కూడా చెప్పాడు. ‘త్వరలో చిరంజీవి గారితో కలిసి వర్క్ చేయబోతున్నాను. చిరంజీవి, రామ్ చరణ్ నాకు చాలా క్లోజ్. వెంకటేష్ కూడా నాకు బాగా తెలుసు. ఆయనతో కూడా మూవీ చేయబోతున్నాను’ అంటూ అదిరిపోయే న్యూస్ రివీల్ చేశాడు.
మలయాళ హిట్ ‘లూసిఫర్’ ఆధారంగా చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ చేస్తున్నారు. ఒరిజినల్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను తెలుగులో సల్మాన్ పోషిస్తున్నాడు. ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయమే. కానీ తను వెంకటేష్ సినిమాలో యాక్ట్ చేయడమనేది పూర్తిగా కొత్త విషయం.
కాబట్టి వెంకీ ఫ్యాన్స్‌తో పాటు ఇక్కడున్న సల్మాన్ అభిమానులు కూడా ఆనందంలో మునిగిపోవడం ఖాయం. అయితే అది ఏ ప్రాజెక్ట్, సల్మాన్ ఎలాంటి పాత్ర పోషించనున్నాడు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. అ విషయాలు త్వరలోనే రివీల్ చేస్తానని సల్మాన్ చెప్పాడు కాబట్టి అంతవరకు తప్పదు వెయిటింగ్.
This post was last modified on December 1, 2021 10:39 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…