నందమూరి బాలకృష్ణతో టాక్ షో అన్నపుడు చాలామంది ఆశ్చర్యంగా, అనుమానంగా చూశారు. బహిరంగ వేదికల్లో మామూలుగా మాట్లాడ్డానికే చాలా ఇబ్బంది పడిపోయే బాలయ్య.. టాక్ షోను నడిపించడం ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తాయి. అందులోనూ అల్లు వారి ఓటీటీ ఆహా కోసం బాలయ్య ఈ టాక్ షో చేయబోతున్నాడంటే అస్సలు నమ్మబుద్ధి కాలేదు. కానీ నిజంగానే ఈ షో మొదలైంది. విజయవంతంగా రెండు ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది.
‘అన్ స్టాపబుల్’ అనే పేరుతో ప్రసారమవుతున్న ఈ షోకు రికార్డు స్థాయిలో వ్యూయర్ షిప్ చేయడం.. బాలయ్య ఆకర్షణీయమైన లుక్‌తో, మంచి ప్రిపరేషన్‌తో, తనదైన ఎనర్జీతో ఈ షోను సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే ‘అన్‌స్టాపబుల్’కు మంచు మోహన్ బాబు, నాని అతిథులుగా పాల్గొనగా.. తర్వాతి ఎపిసోడ్లో బ్రహ్మానందం, అనిల్ రావిపూడి సందడి చేయబోతున్నారు.
కాగా ‘అన్ స్టాపబుల్’ కొత్త ఎపిసోడ్‌కు సంబంధించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ షోకు అతిథిగా రాబోతున్నాడట. ఐదో ఎపిసోడ్లో సూపర్ స్టార్ హంగామా చూడబోతున్నామట. ఈ ఎపిసోడ్ చిత్రీకరణకు ముహూర్తం కూడా నిర్ణయించేశారట. డిసెంబరు 4న షూట్ జరగనుందట. మహేష్ ఇటీవలే ఎన్టీఆర్ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో పాల్గొన్న సంగతి తెలిసిందే. దాని ప్రోమో కూడా రిలీజైంది. ఈ ఎపిసోడ్ డిసెంబరు 4నే ప్రసారం కాబోతుండగా.. అదే రోజు ఎన్టీఆర్ బాబాయి టాక్ షో చిత్రీకరణలో మహేష్ పాల్గొనబోతున్నాడు.
బాలయ్య-మహేష్ కాంబినేషన్ ఎవ్వరూ ఊహించనిది. భిన్నమైన పర్సనాలిటీస్ కలిగి ఉన్న ఈ ఇద్దరు వారసులు కలిసి ఏం మాట్లాడుకుంటారు.. తమ ఫ్యామిలీస్ గురించి, ఇతర విషయాలపై ఏం చర్చించుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. కచ్చితంగా ఇదొక బ్లాక్‌బస్టర్ ఎపిసోడ్ అవుతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on December 1, 2021 10:32 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…