కరోనా సెకండ్ వేవ్ తర్వాత నెమ్మదిగా పెద్ద సినిమాల సందడి పెరుగుతోంది. హిందీలో ఈ నెల సూర్యవంశీ, సత్యమేవ జయతే, అంతిమ్ లాంటి సినిమాలు రిలీజయ్యాయి. తమిళంలో తాజాగా మానాడు లాంటి పెద్ద సినిమా విడుదలైంది. ఇక డిసెంబరు, జనవరి నెలల్లో తెలుగు సహా వివిధ భాషల్లో భారీ చిత్రాలు వరుస కడుతున్నాయి.
డిసెంబరు 2న అఖండతో టాలీవుడ్లో మాస్ సినిమాల జాతర మొదలవుతోంది. ఇదే రోజు మలయాళంలో మరక్కార్ లాంటి భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా వచ్చే నాలుగైదు రోజుల్లో నాలుగు భారీ చిత్రాల ట్రైలర్లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ చిత్రాలన్నింటిపైనా భారీ అంచనాలుండటంతో సోషల్ మీడియా ఈ ట్రైలర్ల టాక్స్‌తో నిండిపోబోతోంది.
ముందుగా ఈ సోమవారం రెండు పెద్ద సినిమాల ట్రైలర్లు లాంచ్ అవుతున్నాయి. అందులో ఒకటి మరక్కార్ మూవీది కాగా.. ఇంకోటి 83 సినిమాది. మరక్కార్ ఇప్పటికే 2021 సంవత్సరానికి జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. మలయాళంలో తొలిసారి వంద కోట్ల భారీ బడ్జెట్లో తెరకెక్కిన జానపద చిత్రమిది. మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించాడు. ప్రియదర్శన్ రూపొందించిన ఈ సినిమా ఇప్పటికే కొన్ని ప్రోమోలతో ప్రేక్షకులను ఎగ్జైట్ చేసింది. ఏడాదికి పైగా విడుదల కోసం చూస్తున్న సినిమా ఎట్టకేలకు భారీ ఎత్తున రిలీజవుతుండటం, దాని ట్రైలర్ లాంచ్ అవుతుండటంతో సౌత్ ప్రేక్షకులంతా ఎగ్జైటెడ్‌గా ఉన్నారు.
ఇక 1983 ప్రపంచకప్ విజయం నేపథ్యంలో తెరకెక్కిన 83 సినిమా ట్రైలర్ వస్తుండటంతో సినీ, క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ ట్రైలర్ కూడా సోమవారమే రిలీజవుతుంది. ఇక డిసెంబరు 3న ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన ఆర్ఆర్ఆర్ టీం ట్రైలర్ లాంచ్ చేస్తోంది. దీనిపై అంచనాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక తెలుగు నుంచి రానున్న మరో మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ట్రైలర్‌ను డిసెంబరు 6న లాంచ్ చేయబోతున్నారు. మొత్తానికి వచ్చే వారం రోజుల్లో భారీ సినిమాల ట్రైలర్లతో సోషల్ మీడియా షేక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on November 30, 2021 10:44 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…