అజయ్ దేవగణ్ మూడు దశాబ్దాల కెరీర్లో చాలా వరకు నటుడిగానే కొనసాగాడు. మధ్యలో నిర్మాత అవతారం ఎత్తాడు. ఆయనలో ఒక దర్శకుడు కూడా ఉన్నాడని కొన్నేళ్ల కిందటే తెలిసిందే. ‘శివాయ్’ పేరుతో తనే లీడ్ రోల్ చేసిన ఒక యాక్షన్ మూవీని అతను డైరెక్ట్ చేశాడు. కానీ ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని మాత్రం ఇవ్వలేదు.
యాక్షన్ ఘట్టాలను అద్భుతంగా తీశాడన్న పేరు మాత్రమే మిగిలింది అజయ్‌కి. అయినా అతనే దర్శకత్వాన్ని పక్కన పెట్టేయలేదు. గత ఏడాది ‘మే డే’ పేరుతో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో కీలక పాత్రలు పోషించారు.
కరోనా వల్ల సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యం జరిగింది. రిలీజ్ డేట్ కూడా మార్చారు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో మీడియా ముందుకొచ్చాడు అజయ్ దేవగణ్. అనూహ్యంగా ఈ పేరు మారిపోవడం గమనార్హం.
‘మే డే’ సినిమా పేరును ‘రోడ్ వే 34’గా మార్చేశాడు అజయ్ దేవగణ్. హాలీవుడ్ స్థాయి థ్రిల్లర్ సినిమాలా కనిపిస్తున్న ఈ సినిమాకు ‘మే డే’ అనే టైటిల్ సూటవ్వదని.. మరీ సాఫ్ట్‌గా ఉందని భావించి.. సినిమా కథకు తగ్గట్లుగా ‘రోడ్ వే 34’ అనే టైటిల్ పెట్టాడట అజయ్. ఈ సందర్భంగా సినిమా నుంచి కొత్త పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు.
అజయ్, అమితాబ్, రకుల్ ప్రీత్.. ముగ్గురూ ఇంటెన్స్ లుక్స్‌లో కనిపిస్తున్నారీ పోస్టర్లలో. ఈ పోస్టర్లు చూస్తే ఇదొక ఎయిర్ థ్రిల్లర్ అనిపిస్తోంది. పోస్టర్లలో ఉన్న ఇంటెన్సిటీ సినిమాలో కూడా ఉంటే మంచి విజయమే సాధించే అవకాశముంది. ఈ చిత్రాన్ని 2022 ఏప్రిల్ 29న రంజాన్ కానుకగా విడుదల చేయబోతున్నారు.
ఆ టైంలోకి సల్మాన్ చేస్తున్న కొత్త సినిమా ‘టైగర్ 3’ కూడా థియేటర్లలోకి దిగే అవకాశముంది. మరి బాయ్‌ను ఢీకొట్టడానికి అజయ్ రెడీ అయ్యాడంటే ఈ సినిమాపై అతను చాా ధీమాగా ఉన్నట్లే.
Gulte Telugu Telugu Political and Movie News Updates