Movie News

బోయ‌పాటి ఆ మాట అంటుంటే గుబులే

ప్ర‌తి ద‌ర్శ‌కుడికీ తాను తీసే సినిమా మీద విప‌రీత‌మైన న‌మ్మ‌కం ఉంటుంది. స్క్రిప్టు ద‌గ్గ‌రే ఎంతో న‌మ్ముతాడు కాబ‌ట్టే సినిమా తీస్తాడు. తాను గొప్ప‌గా సినిమా తీస్తున్నాన‌నే న‌మ్మ‌కమే ఆ ద‌ర్శ‌కుడిని ముందుకు న‌డిపిస్తుంది. ఫ‌స్ట్ కాపీ రెడీ అయ్యాక కూడా చాలామందికి తాము తీసిన సినిమాల్లో లోపాలు క‌నిపించ‌వు. అలాగే వ‌చ్చి ప్రి రిలీజ్ ఈవెంట్ల‌లో త‌మ సినిమాల గురించి గొప్ప‌లు పోతుంటారు.

కొన్నిసార్లు వాళ్ల మాట‌ల‌కు త‌గ్గ‌ట్లే సినిమాలుంటాయి. కానీ కొన్నిసార్లు అంచ‌నాలు త‌ల‌కిందుల‌వుతుంటాయి. మ‌రీ ఎక్కువ గొప్ప‌లు చెప్పుకున్న సినిమాలు తుస్సుమ‌నిపిస్తే ఆ మాట‌లు కాస్తా ట్రోల్ మెటీరియ‌ల్స్‌గా మారిపోతుంటాయి. బోయ‌పాటి శ్రీను తీసిన ఓ సినిమా విష‌యంలో అదే జ‌రిగింది. ఆ చిత్ర‌మే.. విన‌య విధేయ రామ‌. ఈ సినిమాపై అప్ప‌ట్లో ఏ స్థాయి అంచ‌నాలున్నాయో తెలిసిందే.

ఈ అంచ‌నాల‌ను మ‌రింత పెంచేసే స్పీచ్ ఇచ్చాడు మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో బోయ‌పాటి శ్రీను. అభిమానులు త‌న‌ను న‌మ్మాల‌ని.. గుండెల మీద చెయ్యేసుకుని సినిమా చూడొచ్చ‌ని బోయ‌పాటి స్టేట్మెంట్ ఇచ్చాడు. తీరా చూస్తే సినిమా ఎంత డిజాస్ట‌ర్ అయిందో తెలిసిందే. ఇక అప్ప‌ట్నుంచి బోయ‌పాటి అన్న గుండెల మీద చెయ్యేసుకుని సినిమా చూడండి.. న‌న్ను న‌మ్మండి అనే డైలాగ్స్ మీమ్ పేజీల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఐతే ఈ సంగ‌తి తెలుసో లేదో కానీ.. బోయ‌పాటి మ‌ళ్లీ అవే ప‌ద ప్ర‌యోగాలు చేశాడు అఖండ ప్రి రిలీజ్ ఈవెంట్లో. బిలీవ్ మి.. గుండెల మీద చెయ్యేసుకుని చూడండి.. రేప్పొద్దున మీరు చూస్తారు.. మామూలుగా ఉండ‌దు.. ఇలాంటి కామెంట్ల‌తో విన‌య విధేయ రామ స్పీచ్‌ను గుర్తుకు తెచ్చాడు బోయ‌పాటి. కాక‌పోతే బాల‌య్య‌తో బోయ‌పాటి సినిమా అంటే గురి త‌ప్ప‌ద‌న్న న‌మ్మ‌కం అంద‌రిలో ఉంది. ఈ సినిమా ట్రైల‌ర్ చూసినా సినిమా క‌చ్చితంగా స‌క్సెస్ అవుతుందనే అంచ‌నాలే క‌లుగుతున్నాయి.

This post was last modified on November 28, 2021 11:14 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

5 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

5 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

6 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

6 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

7 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

7 hours ago