మానాడు.. తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన శింబు హీరోగా నటించిన చిత్రమిది. విలక్షణ చిత్రాలకు పెట్టింది పేరైన వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని రూపొందించాడు. శింబు సినిమాలంటే ప్రతిసారీ ఏదో ఒక వివాదం ఉండాల్సిందే. గతంలో అతడి చిత్రాలు చాలా వాటికి విడుదల విషయంలో సమస్యలు తలెత్తాయి. ‘మానాడు’ కూడా అందుకు మినహాయింపు కాదు. విడుదలకు ముందు రోజు ఫైనాన్స్ సమస్యలు తలెత్తి రిలీజ్‌పై అయోమయం నెలకొంది. ‘మానాడు’ వాయిదా పడబోతున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో అంతటా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఐతే చిత్ర దర్శకుడు, నిర్మాత, హీరో కలిసి వెంటనే రంగంలోకి దిగారు. చర్చలు జరిపారు. సమస్యను పరిష్కరించి సినిమా యధావిధిగా గురువారం రిలీజవుతుందని ప్రకటించారు. తమిళంలో ఏ స్టార్ హీరో సినిమాకైనా తెల్లవారుజామున ఫ్యాన్స్ షోలు పడాల్సిందే. ‘మానాడు’కు కూడా తెల్లవారుజామున 5 గంటలకే షోలు ప్లాన్ చేశారు.
కానీ టికెట్లు బుక్ చేసుకుని ఎంతో ఉత్సాహంగా థియేటర్లకు వచ్చిన శింబు అభిమానులకు నిరాశ తప్పలేదు. ఎక్కడా ఫ్యాన్స్ షోలు పడలేదు. దీంతో కొన్ని చోట్ల గొడవలు, అల్లర్లు జరిగాయి. చివరికి సమస్య పరిష్కారమై ఉదయం 8 గంటల నుంచి తమిళనాట షోలు మొదలయ్యాయి. దీంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది. ఈ ఆందోళనంతా అయ్యాక సినిమాకు అసలెలాంటి టాక్ వస్తుందో అన్న టెన్షన్ మొదలైంది అభిమానుల్లో.
ఐతే వెంకట్ ప్రభు శింబు అభిమానుల నమ్మకాన్ని దెబ్బ తీయలేదు. చాలా కాంప్లికేట్ అయిన టైమ్ లూప్ కాన్సెప్ట్‌ను ఎంటర్టైనింగ్‌గా డీల్ చేసి మంచి సినిమానే అందించాడన్నది అక్కడొస్తున్న టాక్. అన్ని వైపులా టాక్ బాగుంది. రివ్యూలు కూడా ఫుల్ పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో శింబు అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఈ చిత్రం ‘ది లూప్’ పేరుతో శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on November 25, 2021 9:10 pm
పంజాబ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణం కుమార్ షా బుధవారం స్వదేశానికి సురక్షితంగా…
మే 30 విడుదల కావాల్సిన కింగ్ డమ్ విడుదల అధికారికంగా వాయిదా పడింది. పోస్ట్ పోన్ వార్త పాతదే అయినా…
ఏపీలో విపక్ష పార్టీ వైసీపీకి మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ భారీ ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ అదినేత,…
ఒక్కోసారి వివాదాలే సినిమాలకు పబ్లిసిటీ తెచ్చి పెడతాయి. తమిళ స్టార్ కమెడియన్ సంతానం హీరోగా నటించిన డెవిల్స్ డబుల్ నెక్స్ట్…
గుమ్మనూరు జయరాం… బడుగు వర్గాల నుంచి వచ్చి ఏకంగా మంత్రి స్థాయికి ఎదిగిన నేతగా ఓ రేంజి రికార్డు ఆయన…
ఏపార్టీలో అయినా.. అధినేత ఒక మెట్టు దిగి వస్తే.. కార్యకర్తలు, నాయకులు రెండు మెట్లుదిగి వచ్చి అధినే తకు అనుకూలంగా…