ప్రతి సినిమాకీ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఒక సినిమాలో ప్రతి విషయాన్నీ ప్రత్యేకంగా ప్లాన్ చేయడం కొన్నిసార్లే సాధ్యపడుతుంది. కొందరు దర్శకులకే చేతనవుతుంది. ప్రశాంత్ నీల్ అలాంటి దర్శకుడేనని ‘కేజీఎఫ్’ చూస్తే అర్థమవుతుంది. ఎన్నిసార్లు చూసినా కొత్తగా అనిపించే స్క్రీన్ ప్లే.. మాటిమాటికీ వచ్చి మెస్మరైజ్ చేసే హీరో ఎలివేషన్ సీన్స్.. కదిలించే డైలాగ్స్.. కట్టిపడేసే యాక్షన్ సీక్వెన్సెస్.. ఒకటా రెండా, అన్నీ స్పెషల్‌గానే ఉంటాయి ఆ సినిమాలో. ‘సాలార్’ విషయంలోనూ ఇదే టెక్నిక్ ఫాలో అవుతున్నాడట ప్రశాంత్.
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీ ఆద్యంతం చాలా ఎమోషనల్‌గా ఉండబోతోందని టాక్. ఇందులో ప్రభాస్ తండ్రీ కొడుకులుగా కనిపించనున్నాడట. తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్‌లో వస్తుందట. సైనికుడిగా పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడట. ఇక హీరోయిన్ శ్రుతీ హాసన్ క్యారెక్టర్ అయితే కంటతడి పెట్టిస్తుందని అంటున్నారు. ప్రభాస్‌కి, శ్రుతికి మధ్య నడిచే ట్రాక్ మనసుల్ని తాకేలా ఉంటుందట. ప్రీ క్లైమాక్స్‌లో ఆమె చనిపోతుందట కూడా.
ఇక యాక్షన్ సీన్స్ అయితే ఇప్పటి వరకు ప్రభాస్ సినిమాల్లో కనిపించినదానికి మించి ఉంటాయట. కొన్ని సీన్స్‌లో ప్రభాస్ అగ్రెషన్ సినిమాని వేరే లెవెల్‌కి తీసుకెళ్తుందని చెబుతున్నారు. అలాగే ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంది. అది కూడా ఏదో గ్లామర్ కోసం పెట్టింది కాదట. సినిమాలోని ఓ స్పెషల్ సిచ్యుయేషన్‌లో వస్తుందట. దాన్ని ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టితో చేయిస్తున్నారని మొదట వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తన స్థానంలో శ్రద్ధా కపూర్‌ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇవన్నీ వింటుంటే ఈ సినిమా విషయంలో ప్రశాంత్ చాలా స్పెసల్ ఎఫర్ట్ పెడుతున్నాడని అర్థమవుతోంది. ‘కేజీఎఫ్’ ఎఫెక్ట్ వల్ల ప్రేక్షకుల అంచనాలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. యశ్ లాంటి యంగ్ హీరోనే ఆ రేంజ్‌లో ఎలివేట్ చేశాడంటే.. ప్రభాస్ లాంటి ప్యాన్ వరల్డ్ స్టార్‌ని ఇక ఏ స్థాయిలో చూపిస్తాడో అంటూ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకుంటూ పోతున్నారు ఫ్యాన్స్. వాటిని అందుకోవాలంటే ఆమాత్రం స్కెచ్చులు వేయక తప్పదు మరి.
This post was last modified on November 22, 2021 8:41 pm
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…
ఓ మూడేళ్ళ క్రితం దాకా టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డేను వరస బ్లాక్ బస్టర్లు ఉక్కిరిబిక్కిరి…