ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ అందరి దృష్టీ బయోపిక్స్‌పై ఉంటోంది. హీరోలూ వాటికి రెడీ అంటున్నారు. రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌లో పర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ ఎక్కువ. ఎమోషనల్‌గా ఆడియెన్స్‌ని కనెక్ట్ చేసేందుకు కూడా చాన్స్ ఎక్కువ. అందుకే వాటికి అంత డిమాండ్. ముఖ్యంగా బాలీవుడ్ వారు బయోపిక్స్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలో అక్కడ మరో గ్రేట్ పర్సన్ లైఫ్ స్టోరీ తెరకెక్కబోతోంది. ఆయనెవరో కాదు.. ఇండియాస్ ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్.
ఈ విషయాన్ని స్వయంగా ఆనందే కన్‌ఫర్మ్ చేయడం విశేషం. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీని ప్రస్తావన రావడంతో వివరాలు రివీల్ చేశారు ఆనంద్. ‘నా బయోపిక్ తీయడానికి నేను పర్మిషన్ ఇచ్చాను. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నిజానికి ఇది ఎప్పుడో జరగాల్సి ఉంది. కరోనా వల్ల లేటయ్యింది’ అని చెప్పారాయన. మీ పాత్రలో ఎవరు నటిస్తారని అడిగితే ఆమిర్ ఖాన్ అయితే బాగుంటుందని చెప్పారు. ‘నా పాత్ర ఎవరు చేస్తారో నాకైతే ఇంకా తెలీదు. కానీ ఆమిర్ చేస్తేనే బాగుంటుంది. ఆయనకీ నాకూ వ్యక్తిత్వపరంగా చాలా దగ్గర పోలికలు ఉంటాయి’ అని చెప్పారు.
అయితే ఆమిర్ ఒప్పుకుంటాడా అనేదే ఇప్పుడున్న డౌట్. ఆల్రెడీ సూపర్ హిట్ స్పోర్ట్స్ డ్రామా ‘దంగల్’లో రియల్ లైఫ్ రోల్‌లో అదరగొట్టాడు ఆమిర్. తను నటిస్తే విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్ కూడా వేరే లెవెల్‌కి వెళ్తుంది. అయితే ప్రస్తుతం ‘లాల్ సింగ్ ఛద్దా’తో బిజీగా ఉన్నాడు.
ఆమిర్ కనుక ఈ బయోపిక్‌కి ఒప్పుకుంటే ఆ సినిమా రిలీజయ్యాక ఇది సెట్స్‌కి వెళ్తుంది. ఎందుకంటే ఒక సినిమా చేసేటప్పుడు మరో సినిమాకి ఒప్పుకోవడం కాదు కదా, అసలు ఆలోచించడానికి కూడా ఇష్టపడడు మిస్టర్ పర్‌ఫెక్ట్. కాబట్టి ఆయన అభిప్రాయం కోసం వెయిట్ చేయాల్సిందే. ఒప్పుకుంటే ఓకే. లేదంటే టీమ్ మరో యాక్టర్‌ని వెతుక్కోవాల్సి వస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో!
This post was last modified on November 20, 2021 2:00 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…